Shocking: పొలంలోనికి వెళ్లిన బాలికపై ఒక యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా తన లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికను గదిలో బంధించాడు. మరో ముగ్గురు స్నేహితులను పిలిచి...
Shocking: పొలంలోనికి వెళ్లిన బాలికపై ఒక యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా తన లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికను గదిలో బంధించాడు. మరో ముగ్గురు స్నేహితులను పిలిచి...
Minor Girl Gang Raped: ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. పొలానికి వెళ్లిన బాలికపై కొందరు యువకులు సాముహికంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలికను తీవ్రంగా గాయపర్చారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. మార్చి 7న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.
పోలీసులు తెలిపిన తెలిపిన వివరాలు ప్రకారం.. యూపీలోని (Uttar pradesh) ఎటావాకు చెందిన ఒక బాలిక పొలానికి వెళ్లింది. ఎంతసేపటికి ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడిపోయిన కుటుంబ సభ్యులు బాలిక కోసం చుట్టుపక్కల వెతక సాగారు. ఆ తర్వాత.. బాలిక తీవ్ర అపస్మారక స్థితిలో ఇంటికి చేరుకుంది. బాలిక జరిగిన దారుణాన్ని(Girl raped) తన ఇంట్లో చెప్పుకుంది. దీంతో వారు.. సమీపంలోని పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. కానీ పోలీసులు తొలుత.. ఫిర్యాదు స్వీకరించలేదు.
ఆ తర్వాత.. గ్రామస్థులు నిరసన తెలపడంతో నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. బాలిక పోలానికి వెళ్లినప్పుడు ఆమె వెంట ఒక యువకుడు వెళ్లాడు. ఆమెకు కొన్ని మాయమాటలు చెప్పాడు. ఆ తర్వాత.. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక.. అపస్మారక స్థితికి (Attack On Girl ) చేరుకొవడంతో మరొ ముగ్గురిని పిలిచాడు. వారు కూడా బాలికపై తమ పశువాంఛ తీర్చుకున్నారు.
ఆ తర్వాత.. బాలికను అలీగడ్ లోని మార్కెట్ ప్రాంతంలో వదిలేశారు. ఆ తర్వాత .. బాలిక తీవ్ర గాయాలతో ఇంటికి చేరుకుంది. ఈ సంఘటనపై స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శికించాలని డిమాండ్ చేస్తున్నారు.
గతంలో ఇలాంటి కొవకు చెందిన వేధింపుల ఘటన ఒకటి.. గుజరాత్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈ దారుణం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఒక కుటుంబం తమ పిల్లలతో కలిసి ఉంటుంది. ఆమెకు ఇద్దరు బాలికలు. వీరు రెండో అంతస్థులో ఉంటారు. వీరి ఇంటి పక్కన 40 ఏళ్లున్న చందు సంఘ్వానీ ఉండేవాడు. ఇతను ఎప్పుడు బాలికల పట్ల వంకర చూపులతో చూసేవాడు.
వారు బాల్కనీలో ఆడుకొవడానికి వెళ్లి నప్పుడు వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. వారిని చూస్తు వెకిలీగా ప్రవర్తించేవాడు. మీతో మాట్లాడాలి.. దగ్గరికి రావాలని పిలిచేవాడు. ఎప్పుడు చూసిన బాలికలవైపే చూస్తుండేవాడు.
కొన్ని సార్లు బట్టలు విప్పేసి నగ్నంగా తిరిగేవాడు. బాలికలు అతని ప్రవర్తనను ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పారు. వారు అతడిని ఎన్నో సార్లు మందలించారు. ఒకనోక సమయంలో ఆ నీచుడు వీరిపైనే ఎదురు తిరిగాడు. మీకు దిక్కున్న చోట చెప్పుకొండంటు బెదిరింపులకు దిగాడు. కొన్నిరోజులు వీరు ఒపిగ్గా భరించారు. కానీ అతనిలో మార్పు రాలేదు. చివరికి అతను పైశాచిక వేధింపులు భరించలేక పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోనికి తీసుకున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.