Honey Trap: అందమైన అమ్మాయిల ఫొటోలు పంపి పిచ్చెక్కిస్తారు.. తీరా వెళ్తే ఎలా చుక్కలు చూపిస్తారంటే..

సోషల్ మీడియా, మొబైల్ ద్వారా అందమైన అమ్మాయిల ఫొటోలను పంపిస్తారు. మాయ మాటలు చెప్పి వారిని ఆకర్షిస్తారు. ఇదంతా నమ్మి వచ్చిన వారికి చుక్కలు చూపిస్తారు.

news18-telugu
Updated: October 29, 2020, 10:15 AM IST
Honey Trap: అందమైన అమ్మాయిల ఫొటోలు పంపి పిచ్చెక్కిస్తారు.. తీరా వెళ్తే ఎలా చుక్కలు చూపిస్తారంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సోషల్ మీడియా, మొబైల్ ద్వారా అందమైన అమ్మాయిల ఫొటోలను పంపిస్తారు. మాయ మాటలు చెప్పి వారిని ఆకర్షిస్తారు. వచ్చే వరకు పిచ్చెక్కించే ఫొటోలు పంపుతూ.. వల విసురుతూనే ఉంటారు. ఇదంతా నమ్మి వచ్చిన వారికి చుక్కలు చూపిస్తారు. వీడియోలు తీసి బెదిరిస్తారు. డబ్బులు లాగి వదిలివేస్తారు. అంతటితో ఆగకుండా మారణాయుధాలు చూపి చంపేస్తామని బెదిరింపులకు దిగుతారు. ఇలాంటి ఫిర్యాదులు ఇటీవల అనేకంగా వస్తుండడంతో బెంగళూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. రెక్కీ నిర్వహించి ఏడుగురి ముఠాను అరెస్టు చేసి జైలుకు తరలించారు. వివరాల ప్రకారం.. అంజలి, దీపక్, టైసన్, ప్రేమనాథ్, వినోద్, ప్రకాశ్, ఈశ్వరి అనే ఏడుగురు సభ్యుల ముఠా బెంగళూరులోని మహదేవపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నారు. వీరు బాగా డబ్బులు ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని తమ దందా సాగిస్తున్నారు. వారు ఉండే ప్రాంతంలో ఒక వేశ్యావాటికను స్థావరంగా చేసుకుని ఈ బ్లాక్ మెయిలింగ్ బిజినెస్ సాగిస్తున్నారు. ధన వంతులు, ఐటీ ఉద్యోగుల మొబైల్ నంబర్లు, సోషల్ మీడియా ఖాతా వివరాలను సేకరిస్తారు.

అనంతరం మెసేజ్ లు, ఫొటోలను పంపి వలపు వల విసురుతారు. ఎవరైనా వీరి మాట నమ్మి వస్తే అప్పుడు తమ అసలు రూపం చూపిస్తారు. ఆ వ్యక్తి తమ ప్రదేశంలోకి రాగానే అనుకున్న ప్లాన్ ప్రకారం ఆ యువతి భర్త, ఇతర మిత్రులు లోపలికి వచ్చి గొడవ చేస్తారు. వారి వీడియోలను తీసి.. అవి చూపించి బెదిరింపులకు దిగుతారు. తాము చెప్పినంత డబ్బులు ఇవ్వకుంటే ఆ వీడియోలను బయట పెడతామంటూ బ్లాక్ మెయిల్ చేస్తారు. డబ్బులు తీసుకున్న తర్వాత ఈ విషయం బయట ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ కత్తులు, ఇతర ఆయుధాలను చూపి బెదిరిస్తారు.

బెంగళూరు మహానగరంలో ఇటీవల ఇలాంటి ఫిర్యాదులు పోలీసులకు అధికంగా అందుతున్నాయి. దీంతో వారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. పక్కా ప్లాన్ తో రెక్కీ నిర్వహించారు. ఏడుగురు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశారు. వారి నుంచి కొన్ని వీడియోలు, కత్తులు తదితర మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియా, ఫోన్ కు అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్ లను చూసి మోసపోవద్దని ఈ సందర్భంగా పోలీసులు సూచిస్తున్నారు.
Published by: Nikhil Kumar S
First published: October 29, 2020, 10:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading