crime : ప్లైట్‌లో వస్తారు...దొంగతనం చేస్తారు... పోలీసునంటూ దర్జాగా వెళ్లిపోతారు..ఇంతకి వీళ్లు..ఎవరు ..?

ప్రతీకాత్మక చిత్రం

crime : బైకులు దొంగతనం చేయడం ఆ ముఠాకు చాలా ఈజీ.. ఓ రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి ఫ్లైట్‌లో వచ్చి దర్జాగా బైకులు కొట్టుకుపోతున్న ముఠా పోలీసులకు చిక్కారు..

  • Share this:
    బైకులు దొంగతనం చేస్తూ..ఓ ముఠా జల్సాలు చేస్తున్నారు. ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి దోంగతనం చేసిన బైకులు తరలించి వాటిని దొంగ పత్రాలతో అమ్ముతున్నారు. బైకులు దొంగతనం అయిన తర్వాత రాష్ట్రాలు దాటుతుండడంతో వారి దోంగతనం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లింది...బైకు దొంగతనాలపై కేసులు ఎక్కువవుతుండడంతో నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఆ ముఠాను పట్టుకున్నారు.

    రాజస్థాన్‌కు చెందిన దొంగల ముఠా ఒకటి బెంగళురులో దొంగతనాలకు పాల్పడుతుంది. పార్క్ చేసిన బైకులను హ్యాండిల్స్ విరగ్గొట్టి మరి దోంగతనానికి పాల్పడుతున్నారు. ఇలా ఇరవై ముప్పై బైకులు అయిన తర్వాత తమ రాష్ట్రానికి తీసుకువెళుతున్నారు. నెంబర్ ప్లేట్లు మార్చడంతోపాటు సరిహద్దులు దాటేందుకు బైక్‌పై పోలీసు అని రాసి మరి తప్పించుకుంటున్నారు

    ఇక బైకులు అమ్మెందుకు సరికొత్త ప్లాన్ వేశారు. దొంగిలించిన బైకులు అమ్మెందుకు ఓఎల్‌ఎక్స్‌ను ఆశ్రయిస్తున్నారు. అందులో పెట్టిన బైకు పెపర్లు వాటి నంబర్లను తీసుకుని అవే పేర్లు బండి నంబర్లతో దొంగ పత్రాలను సృష్టిస్తారు. అనంతరం వాటిని దర్జాగా అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తారు..ఇలా ప్రతి రెండు మూడు నెలలకు ఓసారి బెంగళూరు వచ్చి బైకులు దోంగతనం చేస్తూ వాటి ద్వారా వచ్చి డబ్బుతో ఎంజాయ్ చేయడం వారికి అలవాటుగా మారిపోయింది.

    ఇక్కడ మరో ట్విస్ట్ ఏటంటే దొంగతనం చేసేందుకు ఆ ముఠా సభ్యులు రాజస్థాన్ నుండి బెంగళూర్ కు ఫ్లైట్‌ వస్తారు. అనంతరం బైకులు వేసుకుని రాజస్థాన్ వెళ్లిపోతారు..ఇలా చాలా రోజులుగా దోంగతనం చేస్తున్న ముఠాను బెంగళూరు పోలీసులు సీసీ కెమెరాల సహయంతో పట్టుకున్నారు. వారి వద్ద నుండి 26 బైకులు
    స్వాధీనం చేసుకున్నారు.
    Published by:yveerash yveerash
    First published: