వినాయకుడి పులిహోర తిని 100 మందికి అస్వస్థత.. ఏం జరిగింది?

వినాయకుడి పులిహోర ప్రసాదం తిని సుమారు 90 మంది అస్వస్థకు గురయ్యారు. లింగంపల్లి గ్రామంలో జరిగిన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.

news18-telugu
Updated: September 12, 2019, 8:16 PM IST
వినాయకుడి పులిహోర తిని 100 మందికి అస్వస్థత.. ఏం జరిగింది?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలుగ రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. 11 రోజుల పాటు పూజలు చేసి చివరిరోజు గణేశుడిని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు భక్తులు. డీజేల హోరు, తీన్మార్ డాన్స్‌లతో పల్లెలు, పట్టణాలు మార్మోగుతున్నాయి. అన్ని చోట్లా సంబరాలు సంతోషంగా జరుగుతుంటే.. కరీంనగర్ జిల్లా గాంగధర మండలంలో మాత్రం అపశృతి చోటుచేసుకుంది. వినాయకుడి పులిహోర ప్రసాదం తిని సుమారు 100 మంది అస్వస్థతకు గురయ్యారు. లింగంపల్లి గ్రామంలో జరిగిన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ప్రసాదం తిన్న వెంటనే వాంతులవడంతో వారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకేసారి ఇంత మంది అస్వస్థతకు గురవడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. గణేశుడి ప్రసాదంలో కుట్రపూరితంగా ఎవరైనా విషం కలిపారా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: September 12, 2019, 7:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading