దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఎన్‌కౌంటర్ పై NHRC ఫిర్యాదుతో నలుగురు నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు నిలిచిపోయాయి. హైకోర్టు ఆదేశాలతో నిందితుల మృతదేహాల్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో ఉన్నప్పుడే డెడ్ బాడీ డీకంపోజ్ అవుతున్నాయని త్వరగా అంత్యక్రియలు అనుమతి ఇవ్వాలని అటు కుటుంబసభ్యులు... ఇటు పోలీసులు అధికారుల్ని కోరారు. అయితే NHRC విచారణతో అది కాస్త కుదరలేదు. దీంతో నలుగురు డెడ్ బాడీలు కాస్త గాంధీ ఆస్పత్రికి తరలించారు.
గాంధీ ఆస్పత్రి మార్చురీలోని నిందితులు మహ్మద్ ఆరీఫ్, చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్ మృతదేహాలు భద్రపరిచారు. అయితే ఇవి పాడవ్వకుండా ఉండాలంటే వాటికి వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మృతదేహాలకు రూ. 7500 విలువైన ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఈ ఇంజక్షన్ ఇస్తే మృతదేహం పాడవ్వకుంటా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. కోర్టు ఆదేశాల వచ్చేవరకు ఈ ఇంజక్షన్లు ఇస్తూ డెడ్ బాడీలు భద్రపరచాల్సి ఉంటుంది. వారానికి ఒకసారి నాలుగు మృతదేహాలకు ఈ ఇంజక్షన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ ఇంజక్షన్లు తెప్పించి ఇస్తున్నారు. ఈ ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల దాదాపు నాలుగు నెలల పాటు డెడ్ బాడీలు చెడిపోకుండా ఉంటాయని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. కోర్టు ఆదేశాల వరకు గాంధీ ఆస్పత్రిలోనే డెడ్ బాడీలు ఉండనున్నాయి. నలుగరు నిందితుల్ని ఈనెల 6వ తేదీన చటాన్ పల్లి వద్ద పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Disha, Disha murder case, Gandhi hospital, Shadnagar encounter, Shadnagar rape, Telangana