హోమ్ /వార్తలు /క్రైమ్ /

Divya Murder Case | లొంగిపోయిన నిందితుడు వెంకటేష్

Divya Murder Case | లొంగిపోయిన నిందితుడు వెంకటేష్

దివ్య (file)

దివ్య (file)

దివ్య కేసులో నిందితుడు వెంకటేష్ పోలీసుల ఎదుట లొంగపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.

వ్య కేసులో నిందితుడు వెంకటేష్ పోలీసుల ఎదుట లొంగపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఆ పోలీసులు ఇచ్చిన సమాచారంతో వేములవాడ చేరుకున్న గజ్వేల్ పోలీసులు వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని సిద్దిపేట జిల్లాకు తరలించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన 24 ఏళ్ల దివ్య గజ్వేల్‌లోని ఏపీజీవీబీ (ఆంధ్రప్రదేశ్ గ్రామీణవికాస్ బ్యాంకు)లో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. గజ్వేల్‌లో అద్దె గదిలో నివసిస్తోంది. మరో వారం రోజుల్లో దివ్య వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి దివ్య హత్యకు గురైంది. దుండగులు గొంతుకోసి హత్య చేశారు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆమె స్నేహితుడు వెంకటేష్ మీద అనుమానం వ్యక్తం చేశారు. హత్య జరిగినప్పటి నుంచి వెంకటేష్ కనిపించకపోవడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు.

అయితే, ఈ కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. వెంకటేష్‌తో దివ్యకు మూడేళ్ల క్రితమే ప్రేమ వివాహం జరిగినట్లు నిందితుడి కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో వెంకటేష్‌ తల్లిదండ్రులు ఈ పెళ్లిని అంగీకరించకపోవడంతో వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పెళ్లి సమయంలో దివ్య మేజర్‌ కాకపోవడంతో ఆమెను తల్లిదండ్రులు... హాస్టల్‌లో ఉంచి చదివించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు దివ్యను వెంకటేష్‌ వేధించాడని, చివరకు ఈ వ్యవహారం పంచాయితీ వరకూ వెళ్లిందని... దీంతో దివ్య జోలికి రానంటూ వెంకటేష్‌ హామీ పత్రం రాసిచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత దివ్యకు గజ్వేల్‌లోని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు (ఏపీజీవీబీ)లో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రులు ఆమెకు వరంగల్‌కు చెందిన సందీప్‌ అనే యువకుడితో వివాహం నిశ్చయించారు. ఈనెల 26న వారి దివ్య, సందీప్ పెళ్లి జరగాల్సి ఉంది.

First published:

Tags: Crime news, Gajwel, Telangana

ఉత్తమ కథలు