FRUSTRATED UNEMPLOYEE MUTYALA SAGAR ENDS LIFE IN KHAMMAM DIST ACCUSED CM KCR IN SUICIDE NOTE MKS KMM
ఇగ నోటిఫికేషన్లు రావు.. నా చావుకు cm kcr కారణమంటూ నిరుద్యోగి బలవన్మరణం.. రైలు పట్టాలపై రెండు ముక్కలు!
మృతుడు ముత్యాల సాగర్(పాత ఎన్సీసీ ఫొటో)
ముత్యాల సాగర్ మూడేళ్లుగా ఖమ్మంలోని ఓ శిక్షణా సంస్థలో ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్ తీసుకుంటున్నాడు. కాగా ఎంతకీ నోటిఫికేషన్లు రాకపోవడంతో మనస్తాపానికి గురై రైలు కింద తలపెట్టి..
(G.Srinivasa Reddy, News 18, Khammam)
పేద కుటుంబమైనా ఆ యువకుడు గొప్ప కలలు కన్నాడు. ఎలాగైనా సర్కారీ కొలువు సాధించాలని గట్టిగా అనుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి దర్జాగా బతకాలనుకున్నాడు. తాను మంచి స్థాయిలో ఉండి కుటుబసభ్యులను బాగా చూసుకోవాలని ఆశపడ్డాడు. కానీ అతడి ఆశలు అడియాసలయ్యాయి. చేసేది లేక చివరకు ఉసురు తీసుకున్నాడు. తెలంగాణలో మరో నిరుద్యోగి బలవన్మరణం అందరినీ కలిచివేస్తున్నది. ఖమ్మం పట్టణంలో మంగళవారం చోటుచేసుకున్న ఘటనలో ముత్యాల సాగర్ అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ లో సర్కారును, సీఎం కేసీఆర్ ను ఆక్షేపించాడు. వివరాలివి..
మారుమూల ప్రాంతం నుంచి ఖమ్మం నగరానికి వచ్చాడు. ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకున్నాడు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకున్నాడు. ఎన్సీసీ ధ్రువపత్రం కూడా పొందాడు. మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఎంతకీ ఉద్యోగం నోటిఫికేషన్ వస్తలేదు. ఇక చావే శరణ్యమనుకున్నాడేమో... రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఖమ్మంలో జరిగింది. మహబూబాబాద్ జిల్లా గార్ల బయ్యారానికి చెందిన ముత్యాల సాగర్(24) ఖమ్మంలోని ఓ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. ఎన్సీసీ శిక్షణ పొంది ధ్రువపత్రం కూడా పొందాడు.
ముత్యాల సాగర్ మూడేళ్లుగా ఖమ్మంలోని ఓ శిక్షణా సంస్థలో ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్ తీసుకుంటున్నాడు. కాగా ఎంతకీ నోటిఫికేషన్లు రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. 'ఇగ నోటిఫికేషన్లు రావు.. పిచ్చి లేస్తుంది.. నా చావుకు కరోనా, సీఎం కేసీఆర్ కారణం' అంటూ వాట్సప్ స్టేటస్ పెట్టినట్లు అతడి స్నేహితులు తెలిపారు. మంగళవారం ఉదయం ఖమ్మం మామిళ్ల గూడెం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై తలపెట్టి తానువు చాలించాడు. మృతుడి తల నుంచి మొండెం వేరుపడి ఉండగా రైల్వే పోలీసులు గుర్తించారు. అన్నం సేవా సంస్థ సభ్యుల సాయంతో మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై విపక్షాలు ఆందోళనలకు సిద్ధమయ్యాయి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.