Home /News /crime /

FRUSTRATED OVER NOT BEING CURED OF ITCHY SKIN INDORE MAN STABS TO DEATH DOCTORS WIFE BS

వ్యాధి నయం చేయలేదని.. డాక్టర్ భార్యను దారుణంగా హతమార్చి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crime News: వ్యాధి తగ్గకపోవడంతో అసహనం, ఆవేశానికి లోనైన రషీద్.. ఏకంగా వైద్యుడి భార్యను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం ఉదయం చోటుచేసుకుంది.

అతడి పేరు రఫిక్ రషీద్.. వయసు 45.. దురద వస్తోందని ఆరు నెలల క్రితం వైద్యుడి దగ్గరకు వెళ్లాడు.. వైద్యం చేసినా ఎంతకూ తగ్గలేదు. అలా ఆరు నెలలు గడిచాయి. అయినా వ్యాధి తగ్గకపోవడంతో అసహనం, ఆవేశానికి లోనైన రషీద్.. ఏకంగా వైద్యుడి భార్యను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రషీద్ దురదతో బాధపడుతున్నారు. అయితే ఆరు నెలలుగా డాక్టర్ రామకృష్ణ వర్మ క్లినిక్‌లో వైద్యం చేయించుకుంటున్నాడు. అయితే దురదలో ఎలాంటి మార్పూ రాలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన రషీద్.. రామకృష్ణ భార్య లత(50), కుమారుడు అభిషేక్(19)లపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఆ సమయంలో తల్లీకొడుకుల ఆర్తనాదాలు విన్న పొరుగింటి వారు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న వారిద్దర్ని ఆస్పత్రికి తరలించారు.

అయితే లత చికిత్స పొందుతూ మరణించింది. కాగా అభిషేక్ నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, 2015లో జరిగిన ఓ హత్య కేసుతో రషీద్‌కు సంబంధముందని, ఒకసారి జైలుకు కూడా వెళ్లివచ్చాడని పోలీసులు తెలిపారు. అంతే కాకుండా రషీద్ ఎప్పుడూ ఓ కత్తిని వెంటబెట్టుకొని తిరుగుతాడని వెల్లడించారు.
First published:

Tags: Crime, Indore, Madhya pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు