రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. అందరూ చూస్తుండగానే కత్తులతో ఆమెపై దాడి..

వివాహితుడైన సుధాకర్ రెడ్డికి భార్య, ఒక కుమార్తె ఉండటం గమనార్హం. అయితే కుటుంబాన్ని పట్టించుకోకుండా కొన్నాళ్లుగా అతను ఒంటరి గానే ఉంటున్నాడు. ఇదే క్రమంలో రోజూ ఓ కాలేజీ విద్యార్థిని వెంటపడటం మొదలుపెట్టాడు.

news18-telugu
Updated: October 17, 2019, 8:34 AM IST
రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. అందరూ చూస్తుండగానే కత్తులతో ఆమెపై దాడి..
ప్రతీకాత్మక చిత్రం (Image: News18 Creatives)
news18-telugu
Updated: October 17, 2019, 8:34 AM IST
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో వివాహితుడైన ఓ యువకుడు ఓ విద్యార్థినిపై కత్తితో దాడి చేశాడు. అయితే అప్పటికే అతను పురుగుల మందు తాగడంతో నురుగులు కక్కుతూ కుప్పకూలాడు. ప్రస్తుతం బాధిత విద్యార్థిని చావు బతుకుల్లో చికిత్స పొందుతుండగా..సదరు ప్రేమోన్మాది కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం.. పాలకొల్లులోని ఓ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని(20) కవిటం గ్రామానికి చెందిన మేడపాటి సుధాకర్ రెడ్డి కొంతకాలంగా వెంటపడి వేధిస్తున్నాడు. వివాహితుడైన సుధాకర్ రెడ్డికి భార్య, ఒక కుమార్తె ఉండటం గమనార్హం. అయితే కుటుంబాన్ని పట్టించుకోకుండా కొన్నాళ్లుగా అతను ఒంటరి గానే ఉంటున్నాడు. ఇదే క్రమంలో రోజు ఆమె వెంటపడటం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు సుధాకర్ రెడ్డి వేధింపుల గురించి కుటుంబ సభ్యులకు చెప్పింది.కుటుంబ సభ్యులు మందలించినా అతనిలో మార్పు రాలేదు.

ఇదే క్రమంలో బుధవారం విద్యార్థిని కాలేజీకి బయలుదేరగా.. సుధాకర్ రెడ్డి ఆమె వెనకాలే వెళ్లాడు.చేతిలో కత్తుల సంచి పట్టుకుని వెంబడించాడు. కొద్ది దూరం వెళ్లాక ఆమెపై కత్తితో దాడి చేశాడు. దాంతో ఆమె పరిగెత్తగా.. దారిలో ఉన్న కొంతమంది సుధాకర్ రెడ్డిని అడ్డుకునేందుకు యత్నించారు. రెచ్చిపోయిన సుధాకర్ రెడ్డి వాళ్లను తప్పించుకుని ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తల,మెడ,భుజాలపై కత్తితో నరికాడు. ఆపై నురుగులు కక్కుతూ అక్కడే కుప్పకూలాడు. దీంతో ఇద్దరిని వేర్వేరు వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు సమాచారం.ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

First published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...