Home /News /crime /

FRIENDS OF THE GROOM KILLED A YOUNG MAN DURING AN ALTERCATION DURING A WEDDING DJ PROCESSION IN ADILABAD ADB PRV

OMG: ఇంటి ముందుకొచ్చిన డీజే సౌండ్​ తగ్గించమని అడిగినందుకు.. పెళ్లి కొడుకు స్నేహితులు ఇంత పని చేస్తారా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గ్రామంలో రెండు పెళ్లి డీజే బరాత్​లలో జరిగిన గొడవ ఒకరి మృతికి కారణమైంది.   దిలావర్ పూర్ మండలం కాల్వ తండా గ్రామంలో జరిగిన గొడవలో గ్రామానికి చెందిన మెగావత్ నవీన్(28) ను కొందరు యువకులు తీవ్రంగా కొట్టడంతో నవీన్ అక్కడక్కడే మృతి చెందాడు

    (లెనిన్​, ఆదిలాబాద్​, న్యూస్​ 18)

    ఓకే గ్రామంలో రెండు పెళ్లి డీజే బరాత్​లలో జరిగిన గొడవ (during a wedding DJ procession) ఒకరి మృతికి కారణమైంది. ఆదిలాబాద్  (Adilabad)​ జిల్లా  దిలావర్ పూర్ మండలం కాల్వ తండా గ్రామంలో జరిగిన గొడవలో గ్రామానికి చెందిన మెగావత్ నవీన్(28) ను కొందరు యువకులు( Friends of the groom) తీవ్రంగా కొట్టడంతో నవీన్ అక్కడక్కడే మృతి చెందాడు. ఈ గొడవకు పాత కక్షలే (Old factions) కారణమని గ్రామస్తులు పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన సాయికి, నవీన్ కు పాత కక్షలు ఉన్నాయి. అయితే సాయి వివాహం బుధవారం జరిగింది. దీంతో రాత్రిపూట నవీన్ ఇంటి ముందు నుండి సాయి పెళ్లి బరాత్​ డీజే సిస్టమ్ (DJ System) లతో వెళుతుండటంతో కాస్త శబ్దాన్ని తగ్గించాలని నవీన్ కోరడంతో గొడవ ప్రారంభమైంది. పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని సాయి మిత్రులందరూ ( Friends of the groom) కలిసి నవీన్​ను తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు (Police)భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని నిర్మల్ (Nirmal) జిల్లా ఆస్పత్రికి తరలించారు. నవీన్ మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

    జగిత్యాలలో ..

    గతంలో ఇలాంటి ఘటనే జగిత్యాలలో జరిగింది. పెళ్లి బరాత్‌లో డీజే పాటల విషయంలో జరిగిన గొడవ ఓ యువకుడి హత్యకు దారితీసింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన నల్ల నవీన్‌ వివాహం గురువారం జరిగింది. సాయంత్రం బరాత్‌లో డీజే పాటలతో అందరూ నృత్యాల్లో మునిగిపోయారు.  ఓ పెళ్లి కార్యక్రమంలో బరాత్ ఘనంగా నిర్వహించారు. వధూవరుల బంధువులతో పాటు మిత్రులు, స్థానికులు ఆటపాటలతో సందడి చేశారు.  ఇంతలో ఒక్కసారిగా డీజే పాటలు ఆగిపోవడంతో పూదరి లక్ష్మణ్‌ (23) అనే యువకుడు డీజే డ్రైవర్‌తో గొడవకు దిగాడు.

    అక్కడే ఉన్న ఓరుగంటి రాజు అనే యువకుడు కల్పించుకోవడంతో గొడవ మరింత ముదిరింది. అక్కడున్న కొందరు అడ్డుకోవడంతో లక్ష్మణ్‌ తన సోదరుడు సతీష్​తో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గొడవ సందర్భంగా తన సెల్‌ఫోన్‌ పడిపోయిందని లక్ష్మణ్‌ వెతకడానికి మళ్లీ వెనక్కి వచ్చాడు. ఒంటరిగా ఉన్న లక్ష్మణ్‌ను చూసిన రాజు తన వాహనంలో ఉన్న కత్తితో దాడి  చేశాడు. . తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మణ్ మరణించాడు. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Adilabad, Crime news, Murder

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు