‘పెళ్లయితే తాగడం మానేస్తావా?’ అంటూ ఫ్రెండ్‌ను చావగొట్టిన స్నేహితులు

తాను మద్యం మానేస్తున్నట్టు స్నేహితులకు చెప్పాడు. అయినా సరే వారు వినలేదు. తమతో పాటు మద్యం తాగాల్సిందేనంటూ గొడవ చేశారు.

news18-telugu
Updated: May 8, 2019, 6:17 PM IST
‘పెళ్లయితే తాగడం మానేస్తావా?’ అంటూ ఫ్రెండ్‌ను చావగొట్టిన స్నేహితులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
‘ఎవరైనా మద్యం మానేస్తాను’ అంటే మంచి నిర్ణయం తీసుకున్నావు.. శభాష్ అంటూ భుజం తడతారు. అయితే, ఆ ఫ్రెండ్స్ మాత్రం మద్యం తాగడం మానేసినందుకు స్నేహితుడిని చావబాదారు. పంజాబ్‌లో ఈ ఘటన జరిగింది. అమృత్ పాల్ అనే వ్యక్తి మీద ఈ దాడి జరిగింది. అమృత్ పాల్ గతంలో మద్యం తాగేవాడు. ఫ్రెండ్స్‌తో కలసి ఫుల్లుగా పార్టీలు చేసుకునేవాడు. అయితే, కొన్నాళ్ల క్రితం అమృత్ పాల్‌కు వివాహమైంది. ఈ క్రమంలో తాను మద్యం మానేస్తున్నట్టు స్నేహితులకు చెప్పాడు. అయినా సరే వారు వినలేదు. తమతో పాటు మద్యం తాగాల్సిందేనంటూ గొడవ చేశారు. అయితే, అతడు తాను మద్యం మానేశానని స్పష్టంగా చెప్పేశాడు. దీంతో అతడిపై కక్షగట్టిన స్నేహితులు ఓ రోజు రాత్రి ఫుల్లుగా మద్యం తాగి అతడి ఇంటిపై దాడి చేశారు. అమృత్ పాల్‌తో పాటు అతడి భార్య, కుటుంబసభ్యులను కూడా చావబాదారు. ‘ళ్లయితే మద్యం మానేస్తావా?’ అంటూ వారు ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

First published: May 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>