Home /News /crime /

FRIEND KILLED HIS CLOSE FRIEND DUE TO SEXUAL HARASSMENT TO HIS WIFE VRY

Murder : ఉద్యోగ రిత్యా దూరంగా ఉంటున్న స్నేహితుడి భార్యపై కన్ను... విషయం తెలిసిన ఫ్రెండ్ మరో స్కెచ్ వేశాడు...!

murder

murder

Murder : స్నేహితుడే కదా.. క్లోజ్‌గా మూవ్ అయిన మరో స్నేహితుడి భార్యపై కన్నెశాడు.. ఆమె భర్త వారానికి ఓ సారి ఇంటికి రావడాన్ని ఆసరా చేసుకుని ఆమెతో లైంగిక దగ్గర అవుదామని భావించాడు. ( Friend killed his close friend ) కాని విషయం తెలిసిన భర్త మరో ప్లాన్ వేశాడు.

ఇంకా చదవండి ...
  స్నేహితులంటే అన్ని విషయాల్లో ముందుంటారు. కాని ఓ స్నేహితుడి ఇదే విషయాన్ని ఆసరా చేసుకుని ఫ్రెండ్ భార్యపై కన్నెశాడు. కుటుంబ విషయాల్లో తోడుగా ఉంటూ.. నమ్మించాడు.. స్నేహితుడు ఇంట్లో లేనప్పుడు ఆయన భార్యతో ఫోన్ చాటింగ్‌లు చేస్తూ లైంగిక వేధింపులకు గురి చేశాడు. ( Friend killed his close friend ) కాని అది కాస్త భర్తకు తెలియడంతో ఆయన మరో స్కెచ్ వేశాడు. ముందుగా హెచ్చరించిన మానకపోవడంతో తాను అనుకున్న ప్లాన్ వర్కవుట్ చేశాడు.

  కొందరి విషయంలో ప్రస్తుతం అవసరం కోసమే స్నేహం అన్నట్లుగా మారింది. నేటి సమాజంలో చాలా మంది డబ్బు అవసరాల కోసమో, ఏవైనా పనులు చేయించుకోవడం కోసమో స్నేహం చేయడం సాధారణమైంది. తమిళనాడులో ఇధ్దరు స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. ( Friend killed his close friend )స్నేహితుడే కదా అని రోజూ ఇంటికి తీసుకెళ్తే.. చివరకు స్నేహితుడి భార్యపైనే కన్నేశాడు. రోజూ ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడడం చేస్తుండేవాడు. ఆ చాటింగ్ చివరకు ఎంతవరకు వెళ్లిందంటే..

  వివరాల్లోకి వెళితే.. తమిళనాడు నమక్కల్ జిల్లా కుమరపాలయం ప్రాంతానికి చెందిన వెంకటేష్.. తిరుపూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండేవాడు. కంపెనీకి సమీపంలో ఉంటూ వారానికి ఒకసారి ఇంటికి వెళ్లి భార్యను చూసి వస్తుండేవాడు.( Friend killed his close friend ) వారాంతంలో రోజంతా భార్యతోనే ఉంటూ మరుసటి రోజు యథావిధిగా విధులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో కంపెనీకి సమీపంలో దినేశ్వరన్ అనే వ్యక్తితో వెంకటేష్‌కు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఒకరి వ్యక్తిగత విషయాలు.. ఒకరు చెప్పుకోనేంత స్థాయికి వారి స్నేహం మారిపోయింది.


  Warangal : వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి 1100 కోట్లు.. జీవో జారీ


  ఇలా ఓ రోజు వెంకటేష్‌ ఇంటికి వెళ్లే సమయంలో దినేశ్వరన్‌ను కూడా తీసుకెళ్లి, భార్యకు పరిచయం చేశాడు. భర్త స్నేహితుడే కాబట్టి ఆమె కూడా చనువుగా ఉండేది. ఈ క్రమంలో దినేశ్వర్ ఆమె నంబర్ తీసుకుని.. వెంకటేష్‌కు తెలీకుండా రోజూ ఫోన్లలో మాట్లాడుతుండేవాడు. ( Friend killed his close friend )వెంకటేష్ భార్య కూడా దినేశ్వరన్‌ను నమ్మి.. భర్తకు తెలీకుండా ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. రోజురోజుకూ వారి మధ్య గంటల కొద్ది సంభాషణలు కొనసాగేవి.. దీన్ని ఆసరా చేసుకున్న దినేశ్వర్ ఆమెతో శారీరక సంబంధాల గురించి, అశ్లీలంగా మాట్లాడేవాడు. అయితే దినేశ్వర్ ట్రాప్‌లో పడిన వెంకటేశ్ భార్య సైతం రోజుల తరబడి ఫోన్లో మాట్లాడడం ప్రారంభించింది.

  అయితే.. ఇద్దరి మధ్య మాటలు కొనసాగున్న నేపథ్యంలోనే ఓ రోజు వెంకటేష్‌కు విషయం తెలిసింది. దీంతో తన భార్యను గట్టిగా మందలించాడు. మరోసారి రిపిట్ అయితే బాగుండదంటూ హెచ్చరించాడు. అయితే భర్తకు విషయం తెలియడంతో ఆనాటి నుండి ఆమె ఫోనోలో మాట్లాడడం మానేసింది.( Friend killed his close friend ) కాని అదినేశ్వరన్ మాత్రం ఆ అలవాటును మానుకోలేదు... రోజూ మాట్లాడమని వేధించేవాడు. అయితే దినేశ్వరన్ వేధింపులకు తట్టుకోలేని వెంకటేశ్ భార్య విషయాన్ని భర్తకు తెలిపింది.

  Peddapally : పంచాయితీలోనే భార్యను.. బండతో కొట్టి ప్రాణాలు తీసిన భర్త


  దీంతో వెంకటేశ్ భార్య పైనే కన్నేయండం.. తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో చెప్పినా వినకపోవడంతో మరో రకవైన స్కెచ్ వేశాడు. ఎలాగైనా అతన్ని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. పైకి అనుమానం రానట్టు నటిస్తూ... గత నెల 14న ఇంటికి వెళ్దామంటూ.. దినేశ్వరన్‌ను తీసుకెళ్లాడు. ( Friend killed his close friend )ఇంటికి కాకుండా సమీంపంలోని పెద్ద కాలువ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ మాట్లాడుతూనే..ఒక్కసారిగా దినేశ్వరన్‌ను కాలువలోకి తోసేయండంతో ఊపిరాడక చనిపోయాడు. దినేశ్వరన్ కుటుంబ సభ్యుల పిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.( Friend killed his close friend ) దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. దీంతో వెంకటేష్‌తో పాటూ అతడికి సహకరించిన ఇంకో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Crime news, Tamilnadu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు