నాలుగు గంటల పాటు హోటల్ లో నాపై అత్యాచారం చేసిందంటూ ఓ మహిళపై కేసు పెట్టిన 26 ఏళ్ల యువతి

ప్రతీకాత్మక చిత్రం

నాపై ఆమె అత్యాచారం చేసింది. దాదాపు నాలుగు గంటల పాటు నన్ను చిత్రహింసలకు గురిచేసింది. మత్తు మందు ఇచ్చి మరీ నాపై అఘాయిత్యం చేసింది‘ అంటూ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇలా ఫిర్యాదు చేసింది పురుషుడు కాదు. ఓ స్త్రీ.

 • Share this:
  గోవా పోలీసులకు కొత్త చిక్కు వచ్చి పడింది. ’నాపై ఆమె అత్యాచారం చేసింది. దాదాపు నాలుగు గంటల పాటు నన్ను చిత్రహింసలకు గురిచేసింది. మత్తు మందు ఇచ్చి మరీ నాపై అఘాయిత్యం చేసింది‘ అంటూ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇలా ఫిర్యాదు చేసింది పురుషుడు కాదు. ఓ స్త్రీ. అందుకే పోలీసులకు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. మగాడు ఓ స్త్రీపై అత్యాచారం చేస్తే రేప్ కేసు పెట్టొచ్చు. పోనీ ఓ మహిళే ఒక మగాడిని అత్యాచారం చేసినా రేప్ కేసు పెట్టొచ్చు. కానీ ఓ స్త్రీ మరో స్త్రీపైన కానీ, ఓ పురుషుడు మరో పురుషుడిపై కానీ అత్యాచారం చేస్తే ’రేప్‘ కేసుగా పరిగణించడం ప్రస్తుత చట్టాల ప్రకారం కుదరడం లేదట. అందుకే ఆ మహిళ ఇచ్చిన రేప్ ఫిర్యాదును ’లైంగిక వేధింపుల‘ కేసుల జాబితాలో చేర్చి కేసును నమోదు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

  ఢిల్లీకి చెందిన ఓ యువతి గే, లెస్బియన్, బై సెక్సువల్ వంటి వారి సమస్యలపై పోరాడుతుటుంది. ఆమెకు కొంత కాలం క్రితం ఫ్రెంచ్ కు చెందిన 26 ఏళ్ల యువతి ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయింది. ఆమె కూడా అదే తరహా సమస్యలపై పోరాటం చేస్తుంటుంది. ఫిబ్రవరి 23న ఆ ఢిల్లీ మహిళ గోవాకు వెళ్లింది. అదే సమయంలో ఆ ఫ్రెంచ్ యువతి కూడా అక్కడే ఉన్నట్టు తెలిసింది. దీంతో తనను కలవాల్సిందిగా కోరింది. దీనికి ఫ్రెంచ్ యువతి కూడా సరేనంది. అదే రోజు ఢిల్లీ మహిళ చెప్పిన హోటల్ కు ఫ్రెంచ్ యువతి వెళ్లింది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. అదే సమయంలో తనకు వెన్ను నొప్పి ఉందంటూ ఫ్రెంచ్ యువతి చెప్పింది. తన వద్ద ఆ సమస్యకు చక్కని పరిష్కారం చూపించే మాత్రలు ఉన్నాయంటూ ఓ టాబ్లెట్ ను ఫ్రెంచ్ యువతికి ఆ ఢిల్లీ మహిళ ఇచ్చింది.
  ఇది కూడా చదవండి: వేగంగా దూసుకెళ్తున్న రైలు.. సడన్ గా విడిపోయిన ఇంజన్.. ప్రయాణికుల్లో టెన్షన్.. చివరకు..

  నిజమేనని నమ్మిన ఫ్రెంచ్ యువతి, ఆ మాత్రలను వేసుకుంది. ఆ తర్వాత మత్తులోకి జారుకుంది. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ఢిల్లీ మహిళ తన అసలు రూపాన్ని చూపింది. మత్తులో ఉన్న ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడింది. అత్యాచారం చేసింది. ’దాదాపు నాలుగు గంటల పాటు నాపై ఆమె అత్యాచారం చేసింది. ఆమె ఏం చేస్తోందన్నది నాకు అర్థం అవుతోంది. కానీ నేను ఏం చేయలేని స్థితిలో ఉండిపోయాను. ఆమెను ఎదుర్కోలేకపోయాను‘ అంటూ ఆ ఫ్రెంచ్ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఘటన జరిగిన షాక్ నుంచి కోలుకున్న ఆమె మరుసటి రోజే గోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను అత్యాచారం చేశారంటూ ఆమెపై ఫిర్యాదు చేసినప్పటికీ, దాన్ని రేప్ గా పరిగణించలేక ’లైంగిక వేధింపుల‘ కేసుగా నమోదు చేశారు. ఫిబ్రవరి 25న ఆ ఢిల్లీ మహిళను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.
  ఇది కూడా చదవండి: పెళ్లి కాని అమ్మాయిలే అతడి టార్గెట్.. అందమైన అబ్బాయిల ఫొటోలతో వల.. హైదరాబాద్ లో కొత్త మోసం వెలుగులోకి..!
  Published by:Hasaan Kandula
  First published: