FRENCH PRESIDENT EMMANUEL MACRON WAS BEATEN BY AN EGG IN LYON CHANTING VIVE LA REVOLUTION PRV
Attack on president: ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు మాక్రాన్‌పై దాడి.. అప్రమత్తమైన భద్రతా బలగాలు.. దాడి ఎందుకు చేశారంటే?
ఇమ్మాన్యుయేల్ మాక్రాన్
ఫ్రెంచ్ అధ్యక్షుడు (French president) ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌పై (Emmanuel Macron) "వివే లా విప్లవం (Vive la revolution )" అని నినాదాలు చేస్తూ లియాన్ (lyon)లో ఒక నిరసన కారుడు (protestor) కోడిగుడ్డు (EGG)తో కొట్టడం సంచలనం సృష్టించింది.
ఉగ్రవాదుల దాడుల (Terrorist attacks) నేపథ్యంలో భద్రతా దళాల నడుమ ఉండే ఆసియా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రుల్ని సామాన్యులు నేరుగా తాకలేరు. ఇక అమెరికా సంగతి తెలిసిందే. కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఎంత పెద్ద అధికారి అయినా క్షుణ్ణంగా తనిఖీలు చేశాకే పంపిస్తారు. అటు యూరప్ దేశాల్లోనైతే పాలకులు నేరుగా ప్రజల్లోకి చొచ్చుకుపోవడం సర్వసాధారణంగా జరిగేదే. గొప్పగా భావించే ఆ సంస్కృతి రాబోయే రోజుల్లో చూడలేమేమో. యూరప్ సాంస్కృతిక రాజధాని ఫ్రాన్స్ దేశంలో మంగళవారం చోటుచేసుకున్న ఘటన అలాంటిదే మరి.. ఫ్రెంచ్ అధ్యక్షుడు (French president) ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌పై (Emmanuel Macron) "వివే లా విప్లవం (Vive la revolution )" అని నినాదాలు చేస్తూ లియాన్ (lyon)లో ఒక నిరసన కారుడు (protestor) కోడిగుడ్డు (EGG)తో కొట్టడం సంచలనం సృష్టించింది.
ఫ్రాన్స్ ప్రెసిండెంట్ (France President) ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) లియాన్ (lyon)లో ఉన్న ఫ్రెంచ్ గ్యాస్ట్రోనమీ (French gastronomy)ని సందర్శించడానికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో మీడియా (media) ప్రతినిధులు ఆయనను చుట్టుముట్టారు. మీడియా వాళ్లతో మాట్లాడబోతుండగా హఠాత్తుగా ఓ కోడిగుడ్డు (egg) అధ్యక్షుడి భుజం (shoulder)పై పడింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు (Security units) ప్రెసిడెంట్ మాక్రాన్‌కు రక్షణగా నిలిచారు. ఘటనకు బాధ్యుడైన వ్యక్తి ని అక్కడే అదుపులోకి తీసుకున్నారు.
లియోన్ మ్యాగ్ నుంచి వచ్చిన ఫుటేజీలో కోడిగుడ్డు ప్రెసిడెంట్ భుజం ప్రాంతంలో పడినట్లుగా ఉంది. కానీ, అది పగల్లేదు. అయితే నిరసన కారుడు మాత్రం ఆ సమంలో ‘‘ వివే లా విప్లవం (Vive la)’’ (విప్లవం దీర్ఘకాలం వర్ధిల్లాలి) అంటూ నినాదాలు చేశాడు. అయితే మాక్రాన్ కార్యాలయం మాత్రం దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. అయితే గతంలోనూ మాక్రాన్‌పై దాడి జరిగింది. ఓ వ్యక్తి నేరుగా ప్రెసిడెంట్‌ను చెంప దెబ్బ కొట్టాడు.
జూన్‌లో ఘటన..
ఈ ఏడాది జూన్ (June)లో దేశ పర్యటనలో భాగంగా అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ (Emmanuel Macron) ఆగ్నేయ ఫ్రాన్స్‌కు వెళ్లారు. అక్కడి డ్రోమ్ ప్రాంతంలోని టైన్-ఎల్ హెర్మిటేజ్ గ్రామంలో ఒక ఉన్నత పాఠశాలను సందర్శించి, కొవిడ్ ప్రొటోకాల్స్ ను చెక్ చేసిన అనంతరం తిరిగి వెళ్లేందుకు కారు వద్దకు బయలుదేరారు. అయితే, అప్పటికే అధ్యక్షుడిని చూసేందుకు అక్కడ జనం గుమిగూడటంతో మాక్రాన్ బారికేడ్ల దగ్గరికెళ్లి వారితో కరచాలనాలు చేశారు. ఈ క్రమంలో ఓ యువకుడు అధ్యక్షుడికి షేక్ హ్యాడ్ ఇచ్చినట్లే ఇచ్చి చెంప (slapped) పగలకొట్టాడు. అనూహ్య సంఘటనతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు.
అధ్యక్షుడు మాక్రాన్ ను చెంపదెబ్బ కొట్టిన యువకుడితోపాటు అతనికి సహకరించిన మరో వ్యక్తినీ సెక్యూరిటీ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అరెస్టు సమయంలో ఆ యువకుడు మాక్రాన్ అతివాద ధోరణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, చెంపదెబ్బ తర్వాత అధ్యక్షుడు మళ్లీ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. దేశాధ్యక్షుడిపై యువకుడు చేయి చేసుకోవడాన్ని రాజకీయ పార్టీలన్నీ ఖండించాయి. ప్రజాస్వామ్యంలో చర్చకు, వాదనలకు మాత్రమే చోటుంటుందని, దాడులకు కాదని ఫ్రాన్స్ ప్రధాని జేన్ కాస్టెక్స్ జాతీయ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడిని యువకుడు చెంపదెబ్బ కొట్టిన వీడియో నెట్టింట వైరలైంది. మితిమీరిన జాతీయవాదం, ముస్లిం వ్యతిరేకత, నియంత పోకడలను ప్రదర్శిస్తున్నారని మాక్రాన్ పై ఆరోపణలుండటం తెలిసిందే.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.