యువతి ముందు రోజూ అసభ్యకర చేష్టలు.. తట్టుకోలేక వీడియో తీసి..

Sexual harassment: సెక్సువల్ ఫాంటసీకి అలవాటు పడిన ఓ వ్యక్తి(48) యువతులు కనిపిస్తే చాలు.. వారిముందు హస్త ప్రయోగం చేయడం ప్రారంభించాడు.

news18-telugu
Updated: June 18, 2019, 1:34 PM IST
యువతి ముందు రోజూ అసభ్యకర చేష్టలు.. తట్టుకోలేక వీడియో తీసి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 18, 2019, 1:34 PM IST
సెక్సువల్ ఫాంటసీకి అలవాటు పడిన ఓ వ్యక్తి(48) యువతులు కనిపిస్తే చాలు.. వారిముందు అసభ్యకర చేష్టలు చేయడం ప్రారంభించాడు. యువతులు ఎక్కువగా కనిపించే మెట్రో ఎక్కి రోజూ అదే పనిచేసేవాడు. అతడి ప్రవర్తనకు విసిగిపోయిన ఓ యువతి(20).. ఒక రోజు అతడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని మెట్రో అధికారులను కోరింది. ఈ ఘటన గత ఏడాది డిసెంబరులో ప్యారిస్‌లో చోటుచేసుకోగా, విచారణ అనంతరం అతడికి 8 నెలల జైలు శిక్ష పడింది. అతడు అసభ్యకరంగా ప్రవర్తించిన దృశ్యాన్ని వీడియో యువతి ట్విట్టర్ పోస్ట్ చేయడంతో కొన్ని రోజుల్లోనే మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుంది. చివరికి ఆ వ్యక్తే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తానే ఆ నేరం చేశానని ఒప్పుకొన్నాడు. అతడు బంగ్లాదేశ్‌కి చెందినవాడిగా, ఓ ఫాస్ట్ ఫుడ్ కంపెనీలో పనిచేస్తున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు.

తాజాగా, కోర్టు అతడికి ఎనిమిది నెలల శిక్షతో పాటు, ఇద్దరు యువతులకు 500 యూరోల జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది. అంతేకాకుండా మానసిక నిపుణుడిని కలిసి తనకు ఉన్న సమస్యపై చికిత్స తీసుకోవాలని సూచించారు. నిందితుడిని పరీక్షించిన సైకియాట్రిస్ట్ అతడికి శృంగార కోరికలు ఎక్కువగా ఉండటం వల్లే ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడంటూ సమాధానమిచ్చారు. మరోపక్క నిందితుడు మాత్రం తన వృషణాలకు ఆపరేషన్ జరిగిందని, దాని వల్ల తాను బాధపడుతున్నానంటూ చెప్పుకొచ్చాడు.

First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...