Home /News /crime /

FRAUDSTER POSES AS CISF OFFICER DUPES MAN OF RS 6L HELD IN RAJASTHAN NK

CISF ఆఫీసర్ అరెస్ట్... చివర్లో ట్విస్ట్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rajasthan : ఓ వ్యక్తి మరో వ్యక్తిని రూ.6 లక్షలకు మోసం ఎలా చెయ్యగలడు? అవతలి వ్యక్తి అంత ఈజీగా ఎలా మోసపోయాడు? తెలుసుకుందాం.

    Rajasthan : నిందితుడు అసిఫ్ ఖాన్ (23)... ఓ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌‌సైట్‌లో యాడ్ ఇచ్చాడు. తన కారును అమ్మేయాలనుకుంటున్నట్లు చెబుతూ... జూన్‌లో కొన్ని ఫొటోలు పెట్టాడు. రాజస్థాన్... మాతుంగాలోని ఓ వ్యక్తి... అసిఫ్ ఖాన్‌కు ఫోన్ చేసి... తాను ఆ కారు కొనుక్కోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. కారుకు సంబంధించిన అన్ని లైసెన్సులూ ఉన్నాయా అని అడిగితే... వెంటనే ఆసిఫ్ ఖాన్... తన ఫొటోలు పంపాడు. అందులో అతను CISF యూనిఫామ్‌లో ఉన్నాడు. అలాగే ఓ నకిలీ ఐడీ కార్డును కూడా పంపాడు. అవి చూసిన బాధితుడు... అది నిజమైన కారేననీ, తక్కువ ధరకే తనకు అమ్ముతున్నాడని భావించాడు. ఐతే... అదే కారును మరో ఇద్దరు కూడా కావాలనుకుంటున్నారని అసిఫ్ చెప్పాడు. ఎక్కడ కారును వేరేవాళ్లకు అమ్మేస్తాడోనన్న టెన్షన్‌తో తనే ముందుగా కొనేయాలనుకుంటూ.... రూ.6 లక్షలను హడావుడిగా అసిఫ్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశాడు బాధితుడు. ఆ తర్వాత... అసిఫ్ ఖాన్ తన మొబైల్ స్విచ్ఛాఫ్ చేశాడు. దాంతో బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. పోలీసులు ఏ బ్యాంక్ అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ అయ్యిందో చూశారు. తద్వారా అసిఫ్ ఖాన్ అడ్రెస్ తెలుసుకున్నారు. కట్ చేస్తే... భరత్‌పూర్ వెళ్లి అతన్ని అరెస్టు చేశారు. డబ్బు స్వాధీనం చేసుకున్నా్రు. అసిఫ్ ఖాన్ ఇంకా చాలా మందిని CISF ఆఫీసర్ అని చెప్పుకుంటూ మోసం చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.


    Pics : క్యూట్ స్మైల్ బ్యూటీ కనిహ లేటెస్ట్ స్టిల్స్




    ఇవి కూడా చదవండి :



    ట్రంప్ గెలుపు బాలీవుడ్ సినిమాలా ఉంటుందన్న జూనియర్ ట్రంప్

    నేడు గొల్లపూడి అంత్యక్రియలు... ప్రముఖుల సంతాపాలు

    ప్రపంచ సుందరిగా టోనీ ఆన్న్ సింగ్... భారత యువతికి మూడో స్థానం

    IND vs WI : వన్డే సిరీస్‌పై టీమిండియా కన్ను... నేడు తొలి మ్యాచ్

    ఆయేషా రీపోస్ట్‌మార్టం పూర్తి... కొత్తగా తెలిసిందేంటి?
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Telugu news, Telugu varthalu

    తదుపరి వార్తలు