దొరికిన బంగారం అమ్ముతానంటూ నమ్మించి.. ఎంత పనిచేశాడంటే..

బంగారు బిస్కెట్స్ దొరికాయని, నాకు అర్జెంటుగా డబ్బులు అవసరం పడ్డాయని చెప్పాడు. ఈ బంగారు బిస్కెట్స్‌ను అమ్ముతానంటూ ఆ బంగారం ఫొటోలను నర్సింగ్‌రావుకు పంపాడు.

news18-telugu
Updated: July 9, 2020, 7:44 AM IST
దొరికిన బంగారం అమ్ముతానంటూ నమ్మించి.. ఎంత పనిచేశాడంటే..
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
దొరికిన బంగారం బిస్కెట్స్‌ను తక్కువ ధరకు అమ్ముతానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి నమ్మించాడు. అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నాయంటూ ఆన్‌లైన్‌లో రూ.1.28 లక్షలు లాగేశాడు. తీరా బంగారం ఇవ్వాలని కోరితే.. మొహం చాటేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల నర్సింగ్‌రావుకు రిసాల్ అనే వ్యక్తి మూడు నెలల క్రితం ఫోన్ చేశాడు. మాది హర్యానా రాష్ట్రం, జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తానని, జాబ్ కావాలంటూ అడిగాడు. దీనికి బదులు నర్సింగ్‌రావు తన వద్ద జేసీబీ లేదని చెప్పాడు. అయినా రెండు నెలలుగా ఫోన్ చేస్తూ డ్రైవర్‌గా పనిచేసేందుకు ఎక్కడైనా పెట్టించాలని కోరారు. నెల క్రితం ఫోన్ చేసి నాకు ఓ పాత ఇంట్లో జేసీబీతో పని చేస్తుంటే.. బంగారు బిస్కెట్స్ దొరికాయని, నాకు అర్జెంటుగా డబ్బులు అవసరం పడ్డాయని చెప్పాడు.

ఈ బంగారు బిస్కెట్స్‌ను అమ్ముతానంటూ ఆ బంగారం ఫొటోలను నర్సింగ్‌రావుకు పంపాడు. అది నమ్మిన నర్సింగరావు పలు విడతల్లో ఆన్‌లైన్‌లో రూ.1.28 లక్షలు పంపించాడు. అయినా ఇంకా డబ్బు కావాలంటూ ఫోన్ చేస్తున్నాడు. దీంతో నర్సింగరావుకు అనుమానం వచ్చి బంగారం చూపిస్తేనే మిగతా డబ్బులు ఇస్తానంటూ చెప్పి కాళ్లకల్ గ్రామంలోని బంగారమ్మ ఆలయానికి రప్పించాడు.

అక్కడికి వచ్చిన రిసాల్.. బంగారం బిస్కెట్స్ తరహాలో ఉన్న బిల్లలను నర్సింగ్‌రావుకు ఇచ్చాడు. అనుమానం వచ్చిన నర్సింగ్‌రావు వాటిని తనిఖీ చేయడంతో అవి నకిలీగా తేలిపోయింది. వెంటనే అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. ఈ మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.
Published by: Narsimha Badhini
First published: July 9, 2020, 7:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading