హోమ్ /వార్తలు /క్రైమ్ /

Fraud dating app: అమ్మాయితో చాటింగ్.. డేటింగ్ యాప్ లో నగ్న ఫొటోలు, వీడియో లు షేరింగ్.. చివరకు బ్లాక్ మెయిల్.. అసలేం జరిగింది..

Fraud dating app: అమ్మాయితో చాటింగ్.. డేటింగ్ యాప్ లో నగ్న ఫొటోలు, వీడియో లు షేరింగ్.. చివరకు బ్లాక్ మెయిల్.. అసలేం జరిగింది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Fraud dating app: మోసం చేయడానికి కాదేది అనర్హం అన్న చందంగా మారారు హైదరాబాద్ లోని నేరగాళ్లు. ఎక్కడ చూసినా దోపిడీలు, సైబర్ నేరాలు, దొంగతనాలు ఇలా నేరం ఏదైనా రూటు మార్చుకొని చివరకు అమాయకులను మోసం చేస్తున్నారు. ఎన్ని కేసులు విధించినా చేసే పని చేసకుంటుూనే వెళ్తున్నారు. తాజాగా ఒక కొత్త రకమైన దోపడీ వెలుగులోకి వచ్చింది.

ఇంకా చదవండి ...

  మోసం చేయడానికి కాదేది అనర్హం అన్న చందంగా మారారు హైదరాబాద్ లోని నేరగాళ్లు. ఎక్కడ చూసినా దోపిడీలు, సైబర్ నేరాలు, దొంగతనాలు ఇలా నేరం ఏదైనా రూటు మార్చుకొని చివరకు అమాయకులనే మోసం చేస్తున్నారు. ఎన్ని కేసులు విధించినా చేసే పని చేసకుంటుూనే వెళ్తున్నారు. తాజాగా ఒక కొత్త రకమైన దోపడీ వెలుగులోకి వచ్చింది. ఇది హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆన్ లైన్ లో డేటింగ్ యాప్ క్రియేట్ చేసి .. వారి పేరుతో పేరుతో ఓ ఐడి క్రియేట్‌ చేసి, దాని ద్వారా యువకులను మభ్యపెట్టి అమ్మాయిలు అబ్బాయిలు కమ్యూనికేషన్‌ ఉండేలా చూస్తామని చెప్పి మోసానికి పాల్పడుతున్నారు. ఇలా ఓ యువకుడిని యువకుడిని నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న వ్యక్తులపై పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

  సీఐ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. లోకాంటో ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌ ..పేరుతో ఓ ఐడి క్రియేట్‌ చేసి, దాని ద్వారా యువకులను మభ్యపెట్టి అమ్మాయిలు అబ్బాయిలు కమ్యూనికేషన్‌ ఉండేలా చూస్తామని చెప్పి మోసానికి పాల్పడుతున్న వ్యక్తుల బండారం బయటపడింది. సుచిత్ర గోదావరి హోమ్స్‌ ప్రాంతానికి చెందిన కరుణాకర్‌ అనే యువకుడు ప్రైవేట్‌ జాబ్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో ఉన్న డేటింగ్‌ యాప్‌ను సంప్రదించి ఓ మహిళతో మాటలు కలిపాడు. ఇలా వారం రోజులు మాటలు, చాటింగ్ చూస్తు ఉన్నారు. ఈ వ్యవధిలో అతను నగ్నంగా ఉన్న ఫొటోలను ఆ అమ్మాయి సేకరించింది. అప్పటి నుంచి మొదలైంది అసలు కథ. అప్పటి వరకు ఇద్దరి మధ్య సంభాషణ జరగ్గా వారి మధ్యలో మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడు. నువ్వు పంపించిన ఫొటోలు, వీడియోలు యూట్యూబ్, ఫేస్‌ బుక్‌ పాటు ఇతర సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తామని డబ్బులు డిమాండ్‌ చేశారు. వారు అడిగిన కాడికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టాడు.

  తనలో తాను మదనపడుతూ ఎవరికి చెప్పాలో అర్థం కాక చివరకు కరుణాకర్ పోలీసులను ఆశ్రయించాడు. ఇలా యాప్ ద్వారా తను మోసపోయినట్లు జరిగింది జరిగినట్లు పోలీసులకు తెలిపాడు. తనకు జరిగిన ఘటన వివరాలను వెల్లడిస్తూ ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐ రమేష్‌ కేసు నమోదు చేసుకుని సైబర్‌ క్రైమ్‌కు సమాచారం ఇచ్చారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Crime news, CYBER CRIME, Dating App, Fraud women, Hyderabad, Nude photos, Videos share

  ఉత్తమ కథలు