Home /News /crime /

FOURTEEN WOMEN ESCAPED FROM THE KASTURBA GANDHI MEMORIAL TRUST IN THE GANDIPET ZONE OF THE HYDERABAD SUBURB OF HYDERABAD ON FRIDAY NIGHT PRV

Hyderabad: హైదరాబాద్​లో కలకలం.. కస్తూర్బా ట్రస్టు నుంచి 14 మంది యువతులు పరార్​.. అర్ధరాత్రి కిటికీ గ్రిల్స్​ తొలగించి బయటకి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైద‌రాబాద్ శివారులో గండిపేట మండ‌లం హైద‌ర్షాకోట్‌లో క‌స్తూర్బాగాంధీ స్మార‌క ట్రస్ట్ ఉంది. ఈ కస్తూర్బా గాంధీ స్మారక ట్రస్టు నుంచి 14 మంది యువ‌తులు శుక్రవారం అర్థరాత్రి ప‌రార్ అయ్యారు.

    కస్తూర్బా ట్రస్టు (Kasturba Trust) నుంచి  14 మంది అమ్మాయిలు ఒకేసారి పారిపోవడం కలకలం సృష్టించింది. హైద‌రాబాద్ (Hyderabad) శివారులో గండిపేట మండ‌లం హైద‌ర్షాకోట్‌లో క‌స్తూర్బాగాంధీ స్మార‌క ట్రస్ట్  ఉంది. ఈ కస్తూర్బా గాంధీ స్మారక ట్రస్టు (Kasturba Gandhi Memorial Trust) నుంచి 14 మంది యువ‌తులు (ladies) శుక్రవారం అర్థరాత్రి ప‌రార్ అయ్యారు (Escaped). ఉదయాన్నే ఈ విషయం గుర్తించిన స్మారక ట్రస్టు మేనేజ‌ర్‌ వెంటనే ఈ విషయాన్ని నార్సింగి పోలీసుల‌కు (Narsingi Police) తెలియజేశారు. దీంతో వారు కేసు నమోదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివ‌రాల ప్రకారం.. హైదరాబాద్‌ న‌గ‌రంలో వివిధ పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిలో వేర్వేరు నేరాల్లో పట్టుబ‌డిన యువ‌తులు, మ‌హిళ‌లను (Women) క‌స్తూర్బా గాంధీ స్మార‌క ట్రస్ట్‌లో చేర్చుతారని చెప్పారు. ఆ క్రమంలోనే పట్టుబడ్డ యువతులు, మహిళలను పూర్తి భద్రత మ‌ధ్య కస్తూర్బా గాంధీ స్మారక ట్రస్టు (Kasturba Gandhi Memorial Trust) లో ఓ హాలులో 18 మందిని ఉంచారు. అయితే, శుక్రవారం తెల్లవారుజామున 2 గంట‌ల స‌మ‌యంలో పలువురు మహిళలు బాత్‌ రూం (bathroom)లో కిటికి ఊచ‌లను (Window grills) క‌ట్ చేశారు. 15 మంది పారిపోయేందుకు య‌త్నించారని పోలీసులు చెప్పారు. అలా చేస్తుండగా.. ఓ యువ‌తికి గాయాలు కావ‌డంతో ఆమె అక్కడే ఉండిపోయిందని అన్నారు. మిగ‌తా 14 మంది యువ‌తులు (Ladies) పరారైనట్లుగా పోలీసులు వెల్లడించారు.

    మ‌హారాష్ట్ర, బెంగాల్‌కు చెందిన మహిళలు..

    ఈ విష‌యాన్ని ఉద‌యం గుర్తించిన మేనేజ‌ర్ రామ‌కృష్ణ నార్సింగి పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. పారిపోయిన వారిలో ఎక్కువ‌గా మ‌హారాష్ట్ర, బెంగాల్‌కు చెందిన మహిళలు ఉన్నారు. వీరి కోసం రెండు  బృందాల‌ను ఏర్పాటు చేసి గాలింపు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే, ఇనుప గ్రిల్స్‌ను (Iron Grills) ఎలా కత్తిరించారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కట్ చేసేందుకు ఏం వాడారనే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

    హైదరాబాద్​లోని యూసఫ్ గూడ స్టేట్ హోం..

    గతంలోనూ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లోని యూసఫ్ గూడ స్టేట్ హోం (Yusuf Gooda State Home) నుండి పదకొండు మంది యువతులు పరారయ్యారు. కిటికీ ఊచలు తొలగించి యువతులు పరారయ్యారు. ఎస్సార్ నగర్ పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాఫ్తు చేపట్టారు. పరారైన వారిలో ఆరుగురు రెస్క్యూ హోం యువతులు కాగా, మరో ఐదుగురు అనాథలు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న అనంతరం యువతులు వంట గది డోర్ పగులగొట్టి పరారయ్యారు. స్టేట్ హోం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఇదే స్టేట్​ హోంలో ముగ్గురు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Hyderabad, Ladies, Women missing

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు