హోమ్ /వార్తలు /క్రైమ్ /

Robbery : కస్టమర్లలా వచ్చి.. కాల్పులు జరిపి.. పట్టపగలే 2 కోట్ల విలువైన నగలు దోపిడీ..

Robbery : కస్టమర్లలా వచ్చి.. కాల్పులు జరిపి.. పట్టపగలే 2 కోట్ల విలువైన నగలు దోపిడీ..

CCTV Footage (Photo Credit : Youtube)

CCTV Footage (Photo Credit : Youtube)

Robbery : దోపిడీ దొంగలు ఎంత సాంకేతికత పెరిగినా, తమ పంథా మార్చుకోవడం లేదు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. కస్టమర్లలా ఓ జువెల్లరీ షాపుకి వెళ్లి..

దోపిడీ దొంగలు ఎంత సాంకేతికత పెరిగినా, తమ పంథా మార్చుకోవడం లేదు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. కస్టమర్లలా ఓ జువెల్లరీ షాపుకి వెళ్లి తుపాకులతో బెదిరించి చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, మీరా రోడ్డులోని శాంతినగర్‌ ఏరియాలో ఎస్‌ కుమార్‌ బంగారు నగల దుకాణం ఉంది. గురువారం మధ్యాహ్నం 2గంటల సమయంలో నలుగురు వ్యక్తులు షాపులోకి ప్రవేశించారు. కస్టమర్లమని చెప్పి నగలు చూపించమని అడిగారు. సేల్స్‌ సిబ్బంది నగలను బయటకు తీసిన వెంటనే దుండగుల్లో ఒకడు తుపాకీతో కాల్పులు జరిపాడు. వారికి షాపు సిబ్బంది నగలను చూపిస్తున్న సమయంలో తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో సిబ్బంది, ఇతర కస్టమర్లు భయభ్రాంతులకు గురయ్యారు. సిబ్బందిని బెదిరించి నగలను సంచుల్లో నింపుకోసాగారు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే ఆభరణాలను తీసుకుని దొంగలు అక్కడి నుంచి ఉడాయించారు.

' isDesktop="true" id="717710" youtubeid="DPCSZ5Z7hrQ" category="national">

ఐదు నిమిషాల్లో తమకు కావాల్సిన మేరకు బంగారు నగలను దోచుకుని అక్కడినుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత బయట ఉంచిన బైకుపై ఇద్దరు.. మరో ఇద్దరు బైకును అక్కడే వదిలేసి కాలినడకన వెళ్లిపోయారు. దాదాపు 2 కోట్ల రూపాయలు విలువ చేసే నగలను వారు దోచుకెళ్లిపోయినట్లు సమాచారం. దోపిడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమరాల్లో రికార్డయ్యాయి. దీనిపై కేసు నమోదచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముంబైలో పట్టపగలే ఇలాంటి ఘటన జరగడంతో స్థానిక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. తమకు భద్రత కల్పించాలని పోలీసుల్ని కోరుతున్నారు. దుండుగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.

First published:

Tags: Crime, Crime news, Gold jewellery, Gun fire, Mumbai, Robbery

ఉత్తమ కథలు