హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hyderabad : ఎయిర్‌గన్‌తో గేమ్స్ ఆడి చిన్నారి ప్రాణాలు తీశాడు.. కాల్పుల కేసులో అసలు నిజాలు..

Hyderabad : ఎయిర్‌గన్‌తో గేమ్స్ ఆడి చిన్నారి ప్రాణాలు తీశాడు.. కాల్పుల కేసులో అసలు నిజాలు..

Hyderabad : ఎయిర్ గన్ పేలి మృతి చెందిన చిన్నారి కేసులో పోలీసులు అసలు ట్విస్ట్‌ను బయటపెట్టారు. ప్రమాదవశాత్తు కాకుండా ఫామ్ యజమాని నిర్లక్ష్యం పసిప్రాణాన్ని బలితీసుకుంది. 
ఎయిర్‌గన్‌తో దగ్గర నుండి కాల్చడంతోనే చిన్నారీ మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు.

Hyderabad : ఎయిర్ గన్ పేలి మృతి చెందిన చిన్నారి కేసులో పోలీసులు అసలు ట్విస్ట్‌ను బయటపెట్టారు. ప్రమాదవశాత్తు కాకుండా ఫామ్ యజమాని నిర్లక్ష్యం పసిప్రాణాన్ని బలితీసుకుంది. ఎయిర్‌గన్‌తో దగ్గర నుండి కాల్చడంతోనే చిన్నారీ మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు.

ఇంకా చదవండి ...

  ఫౌమ్‌హౌజ్ యజమాని నిర్లక్ష్యం ఓ పసిప్రాణాన్ని తీసింది. నిర్లక్ష్యంగా ఎయిర్‌గన్‌ను పడేయడంతో

  చిన్నారులు ఆడుకుంటూ మరో చిన్నారీపై కాల్చాడు. దీంతో గాయాల పాలైన చిన్నారీ చికిత్స పొందుతూ

  మృతి చెందింది. రెండు రోజుల క్రితం జిన్నారం పోలీసు స్టేషన్ పరిధిలో ఎయిర్ గన్ పేలిన ఘటన కలకలం

  రేపిన విషయం తెలిసిందే.. ఈ ఘటనలో ప్రసాద్ అనే ఫామ్‌హౌజ్ యజమాని ఓ ఎయిర్ గన్ కొనుగోలు

  చేసి తన ఫామ్‌హౌజ్‌లో పెట్టాడు. కాగా ఫామ్‌హౌజ్‌లో నాగరాజు అనే వ్యక్తి వాచ్‌మెన్ గా పని చేస్తున్నాడు.

  రెండు రోజుల క్రితం నాగరాజుకు సంబంధించి బంధువులు వచ్చారు. దీంతో ఓ పదిహేడళ్ల పిల్లాడు ఎయిర్

  గన్‌ తీసుకుని ఫైర్ చేశాడు. దీంతో ఆ పిల్లెట్ కాస్తా ఫామ్‌హౌజ్‌కు సమీపంలో వెళుతున్న నాలుగు

  సంవత్సరాల శాన్వీ అనే బాలికకు తాకింది. దీంతో ఆబాలిక తలకు పిల్లెట్ తాకడంతో గాయాలు

  అయ్యాయి. దీంతో ఆ బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

  ఈ క్రమంలోనే ఆ బాలిక చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. దీంతో ఆ బాలిక మృత దేహానికి

  పోస్టు మార్టం నిర్వహించారు. కాగా ఇందుకు సంబంధించి మొదటి నుండి అనుమానాలు వ్యక్తం చేస్తున్న

  పోలీసులు ఎట్టకేలకు అసలు నిజం బయటకు తీశారు. దీంతో కాల్పులకు పాల్పడ్డ 17 సంవత్సరాల

  మైనర్ యువకుడితో పాటు ఫామ్‌హౌజ్ యజమాని ప్రసాద్‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

  First published:

  Tags: Crime, Crime news, Hyderabad