మసాజ్‌ చేస్తామని యువకుడిని పిలిచిన నలుగురు యువతులు... నగ్నంగా చేసి...

మసాజ్ చేస్తామంటూ బెదిరించి... పర్స్‌లో ఉన్న డబ్బులు మొత్తం లాక్కుని పారిపోయేందుకు యత్నించిన వేశ్యలు... నగ్నంగానే వారిని వెంబడించిన పర్యాటకుడు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 31, 2019, 9:52 AM IST
మసాజ్‌ చేస్తామని యువకుడిని పిలిచిన నలుగురు యువతులు... నగ్నంగా చేసి...
మసాజ్‌ పేరుతో యువకుడిని లోపలికి పిలిచిన నలుగురు వేశ్యలు... ఆ తర్వాత...
  • Share this:
అతను దుబాయ్‌ను వీక్షించాలనే కోరికతో అక్కడికి వెళ్లాడు. అక్కడ తెలియక నైఫ్ ఏరియాలో ఉన్న ఓ వేశ్యా గృహానికి వెళ్లాడు. కొత్త వ్యక్తి కనిపించగానే మసాజ్ చేస్తామని అతన్ని పిలుచుకెళ్లిన నలుగురు వేశ్యలు... పర్యాటకుడిని పూర్తిగా దోచుకున్నారు. తజిక్ ప్రాంతానికి ఓ వ్యక్తి... సెలవులకని దుబాయ్‌కి వచ్చాడు. ఎలక్ట్రానిక్ పరికరాలు కొనాలనే ఉద్దేశంతో నైఫ్ ఏరియాకు చేరుకున్నాడు. పర్యాటకుడు కనిపించగానే అతనితో మాటలు కలిపిన ఓ వ్యక్తి... మసాజ్ సెంటర్‌కు తీసుకెళ్తానని చెప్పి అదే ఏరియాలో ఉన్న ఓ వేశ్యాగృహానికి తీసుకెళ్లాడు. అందులో ఉన్న నలుగురు వేశ్యలు... అతన్ని లోపలికి తీసుకెళ్లారు. మసాజ్ చేయాలని అతనితో బట్టలు మొత్తం విప్పించారు... ఆ తర్వాత కత్తులతో బెదిరించి అతని పర్స్‌లో ఉన్న డబ్బులు మొత్తం లాక్కున్నారు. దాదాపు 37 వేల దిర్హామ్‌లు (దాదాపు రూ.7 లక్షలకు పైగా) లాక్కుని అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే అనుకోని సంఘటనతో ఆశ్చర్యానికి గురైన అతను... నగ్నంగానే వారి వెంబడి పరుగెత్తాడు. ఒంటి మీద నూలుపోగు లేకుండా రోడ్డు మీద పరుగెత్తుతున్న పర్యాటకుడిని గుర్తించిన స్థానికులు... అతను వెంబడిస్తున్న వేశ్యలను, వారి దగ్గరికి తీసుకొచ్చిన బ్రోకర్‌ను పట్టుకున్నారు.

అతని ద్వారా జరిగిన విషయం తెలుసుకుని... పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... వేశ్యలతో పాటు, బ్రోకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడిని భయపెట్టేందుకు అతని ఒంటిపై కత్తితో గాయం చేసినట్టు తెలిసింది. అతని దగ్గర్నుంచి కొట్టేసిన డబ్బును తిరిగి పర్యాటకుడికి అందించి... వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.First published: May 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>