ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఇరవై రోజుల క్రితం ఓ దారుణమైన సంఘటన జరిగింది. ఓ యువతి, మరో యువకుడు మాట్లాడుకునేందుకు ఓ ప్రదేశంలో కలుసుకున్నారు. అయితే అదే ప్రాంతానికి నలుగురు కిరాతకులు(Four villains) ప్రేమజంటను చూసి పట్టుకున్నారు. ఇక్కడికి ఎందుకొచ్చారని మొదలుపెట్టి యువతి పక్కన ఉన్న కుర్రాడ్ని కొట్టారు(Beating). బెల్టుతో చావదాబాదారు. దుర్మార్గులు అంతటితో ఆగకుండా కుర్రాడి వెంట వచ్చిన యువతిని నలుగురు వ్యక్తులు బలవంతంగా అత్యాచారం(Physical torture) చేశారు. నిర్మాణుష్య ప్రదేశం కావడంతో యువతిని బెదిరించి బలత్కారం చేస్తుంటే అందులో ఒకడు వీడియో తీశాడు. యువతి ప్రియుడ్ని కొడుతున్న దృశ్యాలు రికార్డ్ చేశాడు. అయితే ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్‌గఢ్(Pratapgarh)జిల్లాలో ఏప్రిల్ (April) 9వ తేదిన జరిగింది. ప్రేమజంటలోని యువకుడిపై దాడి చేసి..అటుపై యువతిని అత్యాచారం చేయడంతో బాధితురాలు పోలీసు (Police)లకు ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయంపై కడాయి (Kadai)పోలీస్ స్టేషన్ (Police Station)కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. స్వయంగా బాధితురాలే తనపై సామూహిక అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
యూపీలో తెగించిన కిరాతకులు..
అయితే యువతిపై అత్యాచారం చేసి..ఆమె ప్రియుడ్ని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఎవరు అప్‌లోడ్ చేశారో తెలియదు కాని..విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు అప్పటికప్పుడు చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నించారు. మొదట దాడి చేసినట్లుగా కేసు పెట్టిన పోలీసులు తర్వాత అత్యాచారం, మరికొన్ని సెక్షన్లను చేర్చారు. విషయం తెలిసిన కొందరు యువతి అత్యాచారం కేసు గురించి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో గురించి ప్రశ్నిస్తుంటే ఏ ఒక్క పోలీస్ అధికారి నోరు మెదపడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Uttar pradesh