దారుణం.. యువకుడిపై నలుగురి గ్యాంగ్ రేప్..

కొంతకాలంగా అతన్ని ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న నలుగురు వ్యక్తులు ఆ సెల్ఫీ ఫోటోను చూశారు. వెంటనే నలుగురు కలిసి ఆ రెస్టారెంట్ వద్దకు చేరుకుని అతన్ని కలుసుకున్నారు.

news18-telugu
Updated: December 11, 2019, 3:29 PM IST
దారుణం.. యువకుడిపై నలుగురి గ్యాంగ్ రేప్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ముంబైలో దారుణం జరిగింది. 22 ఏళ్ల ఓ యువకుడిపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అతని అడ్రెస్ తెలుసుకుని మరీ అతనున్న చోటుకు వెళ్లారు. మీ ఫ్యాన్స్ అంటూ అతన్ని నమ్మించి.. తమతో కాసేపు గడపాలని కోరారు.నిజమేననుకుని వెళ్లిన అతనికి అనుకోని షాక్ తగిలింది. బలవంతంగా అతన్ని కారులో ఎక్కించిన ఆ నలుగురు.. అతనిపై గ్యాంగ్‌ రేప్‌కి పాల్పడ్డారు.

పోలీసుల కథనం ప్రకారం.. ముంబై సెంట్రల్ సబర్బన్‌లో నివసించే 22 ఏళ్ల ఓ యువకుడు.. ఇటీవల ఓ రెస్టారెంట్ వద్ద సెల్ఫీ దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. కొంతకాలంగా అతన్ని ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న నలుగురు వ్యక్తులు ఆ సెల్ఫీ ఫోటోను చూశారు. వెంటనే నలుగురు కలిసి ఆ రెస్టారెంట్ వద్దకు చేరుకుని అతన్ని కలుసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మిమ్మల్ని చాలాకాలంగా ఫాలో అవుతున్నామని.. మీకు బిగ్ ఫ్యాన్స్ అని అతన్ని నమ్మించారు. తమతో కాసేపు గడపాలని కోరడంతో అతను సరేనన్నాడు.

అలా 20 నిమిషాల పాటు ఐదుగురు రోడ్లపై చక్కర్లు కొట్టారు. అలా ఓ హోటల్‌కు వద్దకు చేరుకున్నాక.. నలుగురు కలిసి బలవంతంగా అతన్ని ఓ కారులో ఎక్కించారు. అలా కదులుతున్న కారులో మూడు గంటల పాటు అతనిపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. సోమవారం ఉదయం ఓ రోడ్డు పక్కన అతన్ని పడేసి వెళ్లిపోయారు. బాధితుడు అతని తల్లిదండ్రుల సాయంతో వీబి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. నలుగురిలో ఒకరు మైనర్ కావడంతో అతన్ని జువైనల్ హోమ్‌కు తరలించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

First published: December 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>