నలుగురు కూతుళ్ల గొంతుకోసి... తాను ఆ పని చేస్తుండగా పట్టుబడ్డ తల్లి.. గురుగ్రాంలో దారుణం

భార్యాభర్తలు, తల్లీ కూతుళ్ల, తండ్రీ కొడుకుల మధ్య గొడవల ఫలితం.. నిండు ప్రాణాలు తీసుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోనే ఉండే గురుగ్రాంలో దారుణం చోటు చేసుకుంది.

news18
Updated: November 28, 2020, 4:06 PM IST
నలుగురు కూతుళ్ల గొంతుకోసి... తాను ఆ పని చేస్తుండగా పట్టుబడ్డ తల్లి.. గురుగ్రాంలో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 28, 2020, 4:06 PM IST
  • Share this:
క్షణికావేశాలకు ప్రాణాలు బలవుతున్నాయి. మాటల ద్వారా పరిష్కరించుకోవాల్సిన చిన్న చిన్న సమస్యలను కూడా కొంతమంది ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. భార్యాభర్తలు, తల్లీ కూతుళ్ల, తండ్రీ కొడుకుల మధ్య గొడవల ఫలితం.. నిండు ప్రాణాలు తీసుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోనే ఉండే గురుగ్రాంలో దారుణం చోటు చేసుకుంది. నలుగురి కూతుళ్ల గొంతులు కోసి తానూ ఆత్మహత్య చేసుకుంటుండగా ఒక తల్లి పట్టుబడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

పోలీసుల వివరాల ప్రకారం.. ఢిల్లీకి కూతవేటు దూరంలోనే ఉండే గురుగ్రాంలో దారుణం చోటుచేసుకుంది. గురుగ్రాం కు సరిహద్దు గ్రామమైన పిప్రోలి గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఉంటున్న ఫర్మినాకు ఖుర్షీద్ కు 2012లో వివాహమైంది. ఫర్మినాకు ఇది రెండో వివాహం. వీరికి నలుగురు సంతానం. కాగా.. వారిలో చివరికూతురు వయసు 8 నెలలే. మిగిలిన వారి వయసు కూడా పదేళ్లకు మించదని స్థానికులు చెబుతున్నారు. అయితే శుక్రవారం ఫర్మీనా.. అర్థరాత్రి తన నలుగురు కూతుళ్ల గొంతు కోసి హత్య చేసింది. నలుగురిని ఒకే కత్తితో గొంతు కోసి చంపేసింది. నలుగురిని చంపి తానూ గొంతు కోసుకుంటుండంతో అదే సమయంలో ఖుర్షీద్ ఇంటికి చేరుకున్నాడు.

చాక్లెట్లు ఇప్పిస్తానని పిలిచి... పదేళ్ల బాలికపై పూజారి అఘాయిత్యం

కిటికీలోంచి ఇది చూసిన ఖుర్షీద్.. తలుపులను గట్టిగా బాదాడు. వాటిని బద్దలు కొట్టుకుని వెళ్లగా.. ఆమె అప్పటికే హత్యాయత్నానికి పాల్పడుతున్నది. దీంతో ఖుర్షీద్.. ఆమె దగ్గరున్న కత్తిని తీసుకున్నాడు. పక్కనున్న గదిలోకి వెళ్లి చూసేసరికి నలుగురు కూతుళ్లు రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు. అనంతరం ఫర్మీనాను ఆస్పత్రిలో జాయిన్ చేశాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. అయితే ఫర్మీనా తన కూతుళ్లను ఎందుకోసం చంపిందనే విషయం మాత్రం తెలియరాలేదు. ఖుర్షీద్, ఫర్మీనా అన్యోన్యంగానే ఉండే వారని.. వారి మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవని స్థానికులు చెబుతున్నారు. అయినా ఫర్మీనా ఎందుకిలా చేసిందనే దానిమీద పోలీసులు విచారణ చేస్తున్నారు.
Published by: Srinivas Munigala
First published: November 28, 2020, 4:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading