పురుగుల మందు తాగిన నలుగురు అక్కాచెల్లెళ్లు...పెళ్లి కావడం లేదని..

ప్పటికే తమకు పెళ్లి కావడం లేదని.. తమ చెల్లి చేసిన పనితో కుటుంబ పరువు బజారున పడిందని అక్కచెల్లెళ్లు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఇక తమకు ఎప్పటికీ పెళ్లి కాదని భావించి చనిపోయేందుకు నిర్ణయించుకున్నారు.

news18-telugu
Updated: June 27, 2019, 8:56 PM IST
పురుగుల మందు తాగిన నలుగురు అక్కాచెల్లెళ్లు...పెళ్లి కావడం లేదని..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. తమకు పెళ్లికావడం లేదని మనస్థాపానికి గురైన యువతులు..కన్నవాళ్లకు భారం కాకూడదని ఆత్మహత్యాయత్నం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చర్లపల్లిలో ఈ ఘటన జరిగింది. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

చర్లపల్లి మాజీ సర్పంచ్ వెంకటయ్యకు ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురికి పెళ్లి కాగా.. మిగిలిన వాళ్లకు వివాహం కాలేదు. ఐతే చిన్న కూతురు ప్రవళిక ఇటీవల ఓ యువకునితో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమకు పెళ్లి కావడం లేదని.. తమ చెల్లి చేసిన పనితో కుటుంబ పరువు బజారున పడిందని అక్కచెల్లెళ్లు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఇక తమకు ఎప్పటికీ పెళ్లి కాదని భావించి చనిపోయేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఘటనపై కేసునమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు పోలీసులు.


First published: June 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు