గన్ ఫైరింగ్‌లో నలుగురు మృతి... ఎవరు? ఎందుకు?

California : అమెరికాలో గన్ కల్చర్ మళ్లీ కలకలం రేపింది. ఏకంగా నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో ఆరుగురు మృత్యువుతో పోరాడుతున్నారు.

news18-telugu
Updated: November 18, 2019, 1:49 PM IST
గన్ ఫైరింగ్‌లో నలుగురు మృతి... ఎవరు? ఎందుకు?
గన్ ఫైరింగ్‌లో నలుగురు మృతి... ఎవరు? ఎందుకు?
  • Share this:
California : అమెరికా... కాలిఫోర్నియాలో పచ్చిక మైదానంలో ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతోంది. 35 మంది మ్యాచ్ చూస్తున్నారు. ఆట ఉత్కంఠగా సాగుతోంది. ఇంతలో ఒక్కసారిగా గన్ బుల్లెట్ల సౌండ్ వినిపించింది. మ్యాచ్ చూసేవాళ్లంతా... ఒక్కసారిగా బుల్లెట్ల సౌండ్ వినిపించిన వైపు చూశారు. తీవ్ర కలకలం రేగింది. ఎవరికి వాళ్లు చెల్లా చెదురుగా పరిగెత్తారు. మ్యాచ్ చూస్తున్నవారిపైనే ఈ ఫైరింగ్ జరిగింది. ముగ్గురు చనిపోగా... మరొకర్ని ఆస్పత్రికి తరలిస్తుంటే... మధ్యలో చనిపోయారు. గాయపడిన మరో ఆరుగురికి ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. ఓ కుర్రాడు గన్ తీసి... 35 మందిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తేల్చారు. లాస్ ఏంజిల్స్‌కి ఉత్తరంగా... 320 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన, గాయపడిన వాళ్లంతా... 25 నుంచీ 35 ఏళ్ల మధ్యవాళ్లేనని పోలీసులు తెలిపారు. ఇదో అర్థం పర్థం లేని హింస అన్న పోలీసులు... మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు.

ఇప్పుడు పోలీసుల ముందున్నది కాల్పులు జరిపిన వాళ్లను పట్టుకోవడమే. ఒక వ్యక్తే ఫైరింగ్ చేసినట్లు తెలుస్తున్నా... స్థానికులు మాత్రం... ఒకరి కంటే ఎక్కువ మందే చేశారని అంటున్నారు. ఐతే... దీని వెనక ఏ గ్యాంగూ లేదన్న భావన వ్యక్తమైంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.

 

బుల్లి తెరే బెటరంటున్న పల్లవీ గౌడ


ఇవి కూడా చదవండి :

జబర్దస్త్ రష్మీ రిక్వెస్ట్... ఆ రెండున్నర గంటలూ...భర్తకు విషం ఇచ్చిన భార్య... పెళ్లైన వారానికే...

షానా చౌహాన్... సక్సెస్‌కి చిరునామా...

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాబ్డే ప్రమాణస్వీకారం...

ఒంటరి యువతిపై రేప్... చికెన్ బిర్యానీ ఇచ్చి...
First published: November 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు