హోమ్ /వార్తలు /క్రైమ్ /

వామ్మో.. ఏడుగురు వ్యక్తులపై అమానుషం.. మలమూత్రాలు తినేలా చేసి.. ఆ తర్వాత..

వామ్మో.. ఏడుగురు వ్యక్తులపై అమానుషం.. మలమూత్రాలు తినేలా చేసి.. ఆ తర్వాత..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jharkhand: గ్రామంలో ఒక కుటుంబంపై మిగతా వారు దాడిచేశారు. మూకుమ్మడిగా వెళ్లి బయటకు లాక్కొచ్చారు. అంతే కాకుండా మలమూత్రాలు తినిపించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Jharkhand, India

మనిషి రోజు రోజుకు అన్నిరంగాల్లో ఎంతో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాడు. అంతేకాకుండా అన్నిరంగాల్లో దూసుకుపోతున్నాడు. విదేశాలలో కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అయితే.. ఇప్పటికి కొందరు మాత్రం చేతబడి, బాణామని అని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఏదైన వ్యాధి వస్తే చాలు... దానికి ఏవరో చేతబడి చేశారని భావిస్తున్నారు. కొన్ని గ్రామాలలో ఇప్పటికి వీడిని నమ్ముతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. జార్ఖండ్ లోని (Jharkhand) దుమ్కా లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిపై అదే గ్రామానికి చెందిన మరికొందరు దాడులు చేశారు. అంతే కాకుండా వారితో మలమూత్రాలు తినిపించారు. బాధితుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. అంతే కాకుండా వేడి ఇనుపరాడ్ తో దారుణంగా హింసించారు. జిల్లాలోని సరయ్యహత్ బ్లాక్ పరిధిలోని అశ్వరి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వారికి బలవంతంగా మలమూత్రాలు తినిపించారు. నలుగురిని కూడా వేడి ఇనుప రాడ్లతో చిత్రహింసలకు గురిచేసినట్లు నివేదికలు తెలిపాయి.

గ్రామంలో కొన్ని రోజులుగా చాలా మందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అంతే కాకుండా.. పశువులు కూడా అంతుచిక్కని వ్యాధిబారిన పడుతున్నాయి. దీంతో సదరు కుటుంబం చేతబడి కారణంగానే గ్రామంలో ఇలా జరుగుతుందని వారంతా భావించారు. వెంటనే వారి ఇంటికి వెళ్లి మూకుమ్మడిగా దాడిచేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది. ఘటన పట్ల పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే పోలీసులు చేరుకున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా అర్దరాత్రి ముంబైలోని (Mumbai)  మలాడ్ వీధిలో ఇద్దరు మహిళలు చోరికి వచ్చారు. అయితే.. అలర్ట్ అయిన మహిళలు వారిని చుట్టుపక్కలవారు వెంటనే మెల్కొన్నారు.

మహిళలను పట్టుకున్నారు. అయితే.. వారు తొలుత మహిళలు పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాగా భావించారు. ఈ క్రమంలో.. ఇద్దరిని పట్టుకుని బట్టలు తీయించారు. అయితే.. మహిళలుమాత్రం తాము..కేవలం చోరీకి వచ్చామని, పిల్లలను ఎత్తుకుపోయే ముఠా కాదని చెప్పారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Jharkhand

ఉత్తమ కథలు