Home /News /crime /

FOUR PEOPLE ESCAPE WITH FOUR LAKH RUPESS IN THE PRETEXT OF SELLING OLD CAR AK

Car Fraud: కారు అమ్ముతామని చెప్పిన టోకరా.. అదే కారులో పరార్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Car Fraud: డబ్బు తీసుకున్న తర్వాత నిందితులు అమ్మకానికి ఉంచిన అదే కారులో అక్కడి నుంచి పారిపోయారని, ఫిర్యాదుదారుడి ఫోన్ కాల్‌లకు సమాధానం ఇవ్వడం మానేసినట్లు పోలీసులు తెలిపారు.

    తక్కువ ధరకు ఏదైనా వస్తువు వస్తుందంటే దానిని కొనేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించారు. ఢిల్లీలో ఇలా తక్కువ ధరకు ఖరీదైన కారు అమ్ముతామని ప్రకటించిన కొందరు వ్యక్తులు.. చివరకు కొనుగోలుదారుడికి ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తికి సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చి కారు అమ్ముతామని చెప్పారు కొందరు. అలా రూ.4 లక్షలకు పైగా కొనుగోలుదారుడికి టోకరా వేశారు. ఈ మోసానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను హర్యానాకు చెందిన అక్షయ్, శివం, ఆనంద్ శర్మగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. జూన్ 9న ఫిర్యాదు అందిందని.. అందులో కారును విక్రయిస్తానన్న సాకుతో ముగ్గురు వ్యక్తులు రూ.4.62 లక్షలు మోసం చేశారని ఫిర్యాదుదారు తెలిపినట్లు పోలీసులు తెలిపారు.

    టయోటా ఫార్చ్యూనర్ కారును రూ. 8.25 లక్షల తగ్గింపు ధరకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదుదారు సోషల్ మీడియాలో ఒక ప్రకటనను కనుగొన్నారు. దీని తర్వాత ఫిర్యాదుదారు నిందితుడిని సంప్రదించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. లజ్‌పత్ నగర్ గెస్ట్‌హౌస్‌కు రావాలని నిందితులు ఫిర్యాదుదారుని కోరారు. 6.3 లక్షలకు ఒప్పందం కుదిరిందని, ఫిర్యాదుదారు తనకు రూ.4.62 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించారని అధికారి తెలిపారు.



    డబ్బు తీసుకున్న తర్వాత నిందితులు అమ్మకానికి ఉంచిన అదే కారులో అక్కడి నుంచి పారిపోయారని, ఫిర్యాదుదారుడి ఫోన్ కాల్‌లకు సమాధానం ఇవ్వడం మానేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో మిగిలిన డబ్బును ఆర్‌టిజిఎస్ ద్వారా బదిలీ చేయాలని ఫిర్యాదుదారుడికి నిందితులు ఇచ్చిన బ్యాంక్ ఖాతా వివరాలను విశ్లేషించగా, అక్షయ్ ఖాతాకు డబ్బు బదిలీ అయినట్లు తేలిందని అధికారి తెలిపారు. గెస్ట్ హౌస్ నుంచి నిందితుల గురించిన సమాచారాన్ని పోలీసులు రాబట్టి వారి లొకేషన్‌ను కనుగొన్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇషా పాండే తెలిపారు.

    Road Accident: ఏపీలో రక్తమోడిన రహదారులు.. సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు.. వాకింగ్‌ చేసే వ్యక్తిని తప్పించబోయి లారీ-బస్సు ఢీ..!

    Shocking : మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం..మనిషి మాంసం వండించి ఆమెతో తినిపించారు

    ఆ తర్వాత హర్యానాలోని మహేంద్రగఢ్‌కు చెందిన అక్షయ్‌ని అరెస్టు చేశారు. అక్షయ్ నుంచి కారు కూడా స్వాధీనం చేసుకున్నారు. సాకేత్ ఇచ్చిన సమాచారం మేరకు ఇతర నిందితులను అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు. హిల్ స్టేషన్లను సందర్శించడం ద్వారా ఫిర్యాదుదారు ఇచ్చిన డబ్బును తాము ఖర్చు చేసినట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Crime

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు