Home /News /crime /

FOUR PEOPLE DROWNED WHILE TAKING SELFIE AT PAMBAR DAM IN TAMILNADU SB

సెల్ఫీ తీసుకుంటూ... డ్యాంలో పడిపోయిన నలుగురు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డ్యాం దగ్గర సెల్ఫీ తీసుకోబోతుండగా అదుపుతప్పి గట్టుపై నుంచి నలుగురు కూడా ఒక్కసారిగా నీటిలో పడిపోయారు.

    సెల్ఫీ సరదా అనేకమంది ప్రాణాలు బలితీసుకుంటోంది. తాజాగా ఈ సెల్ఫీల మోజులో పడి మరో నలుగురు ప్రాణాలు పోగుట్టుకున్నారు. తమిళనాడులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకుంటూ జలాశయంలో పడి నలుగురు మృతి చెందిన విషాద ఘటన తమిళనాడులో ఆదివారం చోటు చేసుకుంది. కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై సమీప పాంబారు జలాశయం చూసేందుకు ఆదివారం చాలామంది తరలివచ్చారు. అక్కడి సమీపంలోని ఒడ్డపట్టి గ్రామానికి చెందిన సంతోష్‌ (14), స్నేహ (19), వినోద (18), నివేద (20) అనే నలుగురు యువతీ యువకులు కూడా ఆదివారం సాయంత్రం జలాశయం అందాలు చూసేందుకు వెళ్లారు.

    డ్యాం దగ్గర సెల్ఫీ తీసుకోబోతుండగా అదుపుతప్పి గట్టుపై నుంచి నలుగురు కూడా ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. స్థానికులు వెంటనే వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి నలుగురి మృతదేహాలను వెలికితీశారు. సెల్ఫీ కోసం డ్యాంలో పడి ఇలా నలుగురు ప్రాణాలు పోగొట్టుకోవడంతో... వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
    First published:

    Tags: Selfie, Selfie Deaths, Tamil nadu, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు