TS Accidents: పాల్వంచకు ఏమైంది..? 24 గంటల్లో నలుగురి మృతి

Accidents: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణాన్ని వరుస రోడ్డు ప్రమాదాలతో గడిచిన 24 గంటల్లో పట్టణానికి చెందిన నలుగురు మృతి చెందారు.

news18-telugu
Updated: September 26, 2020, 11:58 AM IST
TS Accidents: పాల్వంచకు ఏమైంది..? 24 గంటల్లో నలుగురి మృతి
పాల్వంచ పట్ణణంలో వరస రోడ్డు ప్రమాదాలు
  • Share this:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచను వరుస ప్రమాదాలు వెంటాడాయి. 24 గంటల్లో పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. దీంతో పట్టణం శోకసంద్రమైంది. వివరాల ప్రకారం.. పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తండ్రీకొడుకులు అక్కడికక్కడే చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

శనివారం పాల్వంచ సీతారాంపట్నం సబ్ స్టేషన్ దగ్గర కరెంట్ స్తంభాన్ని బైక్ ఢీకొంది. ప్రమాదంలో సంజయ్ నగర్ కు చెందిన కిరణ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే కిరణ్ తలకు బలమైన గాయం కనిపిస్తోంది. దీంతో అతడిని ఎవరైనా హత్య చేశారా.. లేక ప్రమాదవశాత్తు మృతి చెందాడా అన్న అనుమానాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం కొత్తగూడెం నుంచి పాల్వంచ వస్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. నవభారత్ ఎర్రగుంట చెరువు వద్ద ఆటో ప్రమాదవశాత్తు పల్టీ కొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ వల్లపు రాము అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పాల్వంచ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. వరస ప్రమాదాలతో స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. 24 గంటల్లోనే పట్టణానికి చెందిన నలుగురు చనిపోవడంతో ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ కనిపిస్తోంది.
Published by: Nikhil Kumar S
First published: September 26, 2020, 11:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading