దారుణం... వృద్ధురాలిపై నలుగురు గ్యాంగ్ రేప్... కారంపొడితో...

దారుణం... వృద్ధురాలిపై నలుగురు గ్యాంగ్ రేప్... కారంపొడితో... (ప్రతీకాత్మక చిత్రం)

మనుషుల్లో రాక్షసులు ఉంటారని తరచూ మనం వింటుంటాం. మనుషులు అంత ఘోరంగా ఎందుకు ఉంటారనే డౌట్ మనకు వస్తూ ఉంటుంది. ఈ ఘటనలో ఏం జరిగిందో తెలుసుకుంటే... మనుషుల్లో రాక్షసులు ఉంటారని మరోసారి మనం కాన్ఫామ్ చేసుకోవచ్చు.

 • Share this:
  ఉత్తరప్రదేశ్‌లో అత్యంత దారుణమైన, హేయమైన నేరాలు జరుగుతున్నాయి. అక్కడి మహోబా జిల్లాలోని ఓ గ్రామం (గ్రామం పేరు కావాలనే చెప్పట్లేదు)లో... 60 ఏళ్ల ముసలామెపై... నలుగురు కుర్రాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు... ఆమె మర్మావయవాల (private parts)పై కారం చల్లారు... తాళ్లతో కట్టేసి... తుప్పల్లోకి విసిరేశారు. ఇదంతా ఓ భూమి తగాదా వల్ల జరిగింది.

  శనివారం రాత్రి రోజూలాగే పెద్దావిడ పడుకుంది. నిద్రపోతున్న ఆమెను టవల్ ముఖానికి అడ్డుపెట్టి... అరవనివ్వకుండా చేసి... నలుగురూ ఎత్తుకు పోయారు. మనుషులు లేని నిర్జన ప్రాంతానికి ఎత్తుకుపోయి గ్యాంగ్ రేప్ చేశారు. తనను వదిలేయమని ఎంతగానో బతిమలాడింది. వాళ్లు వదల్లేదు. పైగా... ఎక్కడి నుంచి తెచ్చారో... ప్లాన్ ప్రకారం తెచ్చిన కారం పొడిని మర్మావయవాల్లో పోశారు. చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేశారు. ముళ్లున్న తుప్పల్లోకి ఆమెను విసిరేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే... చంపుతామని బెదిరించి... అక్కడి నుంచి పారిపోయారు.

  ఆల్‌మోస్ట్ జీవచ్ఛవంలా మారిన ఆమె... కనీసం లేవలేకపోయింది. ఆ తుప్పల్లోనే అలాగే ఉండి... అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తెల్లారి లేచిన కుటుంబ సభ్యులు... వరండాలో ఆమె కనపడకపోవడంతో... చుట్టూ అడిగారు. ఆ సమయంలో... ఎవరో పరుగున వచ్చి... తుప్పల్లో ఆమె ఉందని చెప్పారు. దాంతో ఊరంతా అక్కడికి వెళ్లింది. ఆమెను కాపాడి... జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి వచ్చి బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. కేసు రాశారు. చుట్టుపక్కల ఇళ్లలోని సేవాలాల్, భరత్ కుష్వాహా అనే ఇద్దరూ... ఆ నలురురిలో ఉన్నారని ఆమె ఆరోపించింది. తన ఇంటిని, తన భూమినీ వదిలి ఎటైనా పోవాలని కొన్నాళ్లుగా వాళ్లు బెదిరిస్తున్నారని ఆమె పోలీసులకు తెలిపారు. ఈమధ్యే తనపై దాడి కూడా చేశారని చెప్పింది.

  ప్రస్తుతం నలుగురూ పరారీలో ఉన్నారు. పోలీసులు వారికోసం గాలిస్తున్నారు. తన మర్మావయవాలపై కారం పొడి లాంటిది చల్లారనీ, పూశారనీ ఆమె పోలీసులకు కంప్లైంట్‌లో తెలిపారు. మెడికల్ రిపోర్ట్ వస్తే... అదేంటన్నది స్పష్టమవుతుందని మహోబా ఎస్పీ సుధా సింగ్ చెప్పారు.

  ఇది కూడా చదవండి: చదువుకునే రోజుల్లో మొదలైన ప్రేమ... 11 ఏళ్ల తర్వాత ఏమైందంటే...

  ఈ ఘటన ఆ ఊరిలో తీవ్ర భయం కలిగించింది. ఇన్నాళ్లూ ఇక్కడిక్కడే తిరిగేవాళ్లు.. ఇంత పని చేస్తారనుకోలేదని స్థానికులు అంటున్నారు. వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: