• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • FOUR MORE ACCUSED ARRESTED IN HEMANTH MURDER CASE NS

Hyderabad Honour Killing: హేమంత్ కేసులో మరో నలుగురి అరెస్టు.. కీలక విషయాలు చెప్పిన డీసీపీ

Hyderabad Honour Killing: హేమంత్ కేసులో మరో నలుగురి అరెస్టు.. కీలక విషయాలు చెప్పిన డీసీపీ

హేమంత్, అవంతిల పెళ్లి ఫొటో

Hyderabad Honour Killing: హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసులో మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

  • Share this:
    హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసులో మరో నలుగురు నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ మేరకు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు. తాజాగా అరెస్టు చేసిన వారిలో హత్య సూత్రధారి సోమయాల రాజు, సాయన్నతో పాటు హత్యలో పాల్గొన్న ఎరుకల కృష్ణ, మహ్మద్ పాషా ఉన్నారని డీసీపీ చెప్పారు. హేమంత్ అడ్డు తొలగించాలని యుగంధర్ రెడ్డిని అతని బావ లక్ష్మారెడ్డి, అక్క అర్చన కోరారని తమ విచారణలో తేలిందన్నారు. దీంతో వట్టినాగులపల్లికి చెందిన సోమయాల రాజు, ఎరుకల కృష్ణ, మహమ్మద్ పాషా అలియాస్ లడ్డూ, ఐడీఏ బొల్లారానికి చెందిన రౌడీ షీటర్ బ్యాగరి సాయన్నతో కలిసి స్కెచ్ వేసినట్లు పోలీసులు తెలిపారు.

    హేమంత్ కు చెందిన ఐదున్నర తులాల బంగారు బ్రాస్ లెట్, చైన్ ను ఎరుకల కృష్ణ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే హేమంత్ ను చంపేందుకు రూ. 30 లక్షలైనా ఖర్చు చేసేందుకు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి సిద్ధపడినట్లు విచారణలో తేలింది. యుగంధర్ రెడ్డి, అవంతి తండ్రి లక్ష్మారెడ్డిల ఆరురోజుల కస్టడీ సోమవారం ముగిసింది. హేమంత్ హత్యలో అవంతి సోదరుడు ఆశీష్ రెడ్డి పాత్ర ఉన్నట్లు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని డీసీపీ తెలిపారు. ఒక వేళ ఏమైనా ఆధారాలు లభిస్తే అతనిపైనా కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

    చందానగర్‌కు చెందిన హేమంత్ అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం వీరిద్దరు గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే కూతురు ఇష్టం ప్రేమ పెళ్లి చేసుకోవడంపై యువతి తండ్రి ఆగ్రహంగా ఉంటున్నాడు. హేమంత్‌ను ఎలాగైనా అంతమొందించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో కిరాయి గుండాలతో అతన్ని హత్య చేయించాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే హేమంత్‌ను కొందరు వ్యక్తులతో కిడ్నాప్ చేయించాడు. అనంతరం సంగారెడ్డిలో హేమంత్‌ను దారుణంగా హత్యకు గురయ్యాడు.

    హేమంత్‌ను కిడ్నాప్ చేసే సమయంలో అక్కడి నుంచి తప్పించుకున్న యువతి పోలీసులకు సమాచారం ఇచ్చింది.  ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంగారెడ్డి జిల్లా కిష్టాయిగూడెంలో సమీపంలోని చెట్లలో హేమంత్ మృతదేహాన్ని కనుగొన్నారు. అనంతరం పోస్టు మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని నగరానికి తరలించారు. అలాగే ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇక, తాను సమాచారం ఇచ్చినప్పుడు పోలీసులు స్పందించలేదని.. ఒకవేళ స్పందించి ఉంటే ఈ హత్య జరిగేది కాదని బాధితురాలు ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేసింది.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు