Gang Rape Case: రేప్ ఘటనలు జరిగినప్పుడల్లా... రేపిస్టులను ఉరి తియ్యాలనీ, చట్టాలను మరింత కఠినం చెయ్యాలనీ... ఇలా చాలా చెప్పుకుంటాం... ఏం జరిగినా, ఏం చేసినా... అత్యాచారాలు మాత్రం తగ్గట్లేదు. రోజూ చాలా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘోరం జరిగింది హర్యానాలోని యమునానగర్ జిల్లాలో. అక్కడి ఓ గ్రామంలో... నేపాల్‌కి చెందిన ఓ కుటుంబం నివసిస్తోంది. బాధితురాలి భర్తను తాళ్లతో కట్టేసిన దుండగులు... 37 ఏళ్ల ఆ మహిళను గ్యాంగ్ రేప్ చేశారు. ఆమె భర్త ఓ వ్యవసాయ కూలీ. వాళ్లకు 2 ఏళ్ల కూతురు ఉంది. గ్రామంలోని... ఓ వ్యవసాయ గొట్టం (పెద్ద ట్యూబ్)నే ఇల్లులా చేసుకొని... అందులోనే జీవిస్తున్నారు. గురువారం రాత్రి కొందరు దుండగులు కారులో వచ్చారు. వరండాలో నిద్రపోతున్న తన భర్తను తాళ్లతో కట్టేశారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.
ఇదీ జరిగింది:
"గురువారం రాత్రి 11 అయ్యింది. ఐదుగురు దుండగులు ముఖాలకు మాస్కులు ధరించి కారులో వచ్చారు. ఆ సమయంలో నేను, పాప లోపల పడుకొని ఉన్నాం. బయట నిద్ర పోతున్న నా భర్తను తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత నలుగురు లోపలికి వచ్చిన నన్ను గ్యాంగ్ రేప్ చేశారు" అని బాధితురాలు పోలీసులకు తెలిపింది. "ఐదో వ్యక్తి కూడా రాబోతుంటే... నేను బలంగా అతన్ని వెనక్కి నెట్టాను. అతను కింద పడ్డాడు. నన్ను చంపేస్తానని బెదిరిస్తూ బయటకు పోయాడు. వాళ్లంతా వెళ్లిపోయాక... నా భర్తను విడిపించుకున్నాను" అని ఆమె వివరించింది.
అండగా ఊరి పెద్ద:
జరిగిన దారుణాన్ని బాధితులు... ఊరి పెద్దకు చెప్పారు. ఆయన వాళ్లకు ధైర్యం చెప్పి... స్థానిక పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లాడు. దాంతో పోలీసులు IPC సెక్షన్లు 376D (గ్యాంగ్ రేప్), 342 (నిర్బంధించడం), 506 (నేర పూరిత ఉద్దేశం), 452 (ఇంట్లోకి బలవంతంగా రావడం) కింద కేసు రాశారు. ప్రస్తుతం ఆ ఐదుగురి కోసం గాలిస్తున్నారు. ఘటన జరిగిన గ్రామంలో సీసీ కెమెరాలు లేవు. అందువల్ల జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
ఇది కూడా చదవండి:Zodiac signs: ఈ రాశుల వారు ప్రేమ వివాహాలకే మొగ్గు... అంతా ఆ గ్రహాల ప్రభావం
ప్రధానంగా కారులో వచ్చిన వాళ్లు ఆ ఏరియా గురించి ముందే రెక్కీ వేసి తెలుసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అందువల్లే పక్కా ప్లాన్‌తో తాళ్లు తెచ్చి మరీ... ఈ దారుణానికి పాల్పడినట్లు అంచనా వేస్తున్నారు. కారులో వచ్చారు కాబ్టటి... వాళ్లంతా రోడ్ సైడ్ రోమియోలు కావచ్చనీ లేదంటే పాత నేరస్థులు కావచ్చని అనుకుంటున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి... దోషులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామంటున్నారు.
Published by:Krishna Kumar N
First published:December 26, 2020, 09:10 IST