సిద్దిపేటలో వ్యభిచార ముఠా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు..

సిద్దిపేటలో వ్యభిచార ముఠా గుట్టురట్టు సంచలనం రేపింది. స్థానిక లాడ్జిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న నలుగురు మహిళలతో పాటు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు.

news18-telugu
Updated: December 25, 2018, 10:16 PM IST
సిద్దిపేటలో వ్యభిచార ముఠా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సిద్దిపేట జిల్లా కేంద్రంలో వ్యభిచార ముఠా గుట్టురట్టయింది. పక్కా సమాచారంతో లక్ష్మి లాడ్జిపై దాడి చేసిన పోలీసులు విటులతో పాటు నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని లక్ష్మి లాడ్జిలో వ్యభిచారం జరుగుతున్నట్టు వారికి సమాచారం అందింది.

సమాచారం అందిన వెంటనే స్థానిక సీఐ నేతృత్వంలో లాడ్జిపై దాడులు చేయగా.. రాజు, రాజయ్య, నర్సింహులు, కుంటయ్యతో పాటు నలుగురు మహిళలు వ్యభించారం చేస్తూ రెడ్ హ్యాండె‌డ్‌గా పట్టుబడ్డారు.అనంతరం మీడియాతో మాట్లాడిన సీఐ వెంకటరామయ్య.. పేకాట, వ్యభిచారం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పట్టుబడ్డవారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడ వ్యభిచారం జరిగిన సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.

First published: December 25, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>