ఉరితాళ్లతో తహశీల్దార్ ఆఫీసుకు.. రామకుప్పంలో రైతు కుటుంబం ఆగ్రహం..

రెవిన్యూ యంత్రాంగం చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయిన ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యాయత్నం చేసింది.

news18-telugu
Updated: November 6, 2019, 3:35 PM IST
ఉరితాళ్లతో తహశీల్దార్ ఆఫీసుకు.. రామకుప్పంలో రైతు కుటుంబం ఆగ్రహం..
ప్రతీకాత్మక చిత్రం (File)
  • Share this:
రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహశీల్దార్ విజయారెడ్డిని సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన మరవకముందే ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. రెవిన్యూ యంత్రాంగం అలసత్వానికి నిరసనగా, వారిచుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయిన ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యాయత్నం చేసింది. తహశీల్దార్ కార్యాలయంలోనే ఉరివేసుకోవడానికి ప్రయత్నం చేసింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలానికి చెందిన బాబు అనే రైతు కుటుంబం ఎమ్మార్వో ఆఫీసులో ఉరిపోసుకోబోయింది. అయితే, అక్కడున్నవారు వారిని అడ్డుకున్నారు.

రామకుప్పం మండలంలో బాబు సహా ఏడు కుటుంబాలకు చెందిన ఏడు ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని గత ప్రభుత్వ హయాంలో వేరొకరికి పట్టాలు ఇచ్చారు. అయితే, ఆ భూమి తమదేనంటూ బాబు రెవిన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఆరు నెలలుగా తిరుగుతున్నా.. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో బాబు తన కుటుంబంతో సహా తహశీల్దార్ ఆఫీసులో ఉరి వేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎమ్మార్వో ఆఫీసుకు ఉరితాళ్లు బిగించి... తమ భూమి తమకు ఇవ్వకపోతే ఇక్కడే చనిపోతామని హెచ్చరించారు. మరోవైపు కురుముల కోటలో బాలకృష్ణ అనే రైతు ఆన్‌లైన్లో తన పొలానికి చెందిన రికార్డులు అప్‌డేట్ చేయించుకోవడానికి ఆరు నెలలుగా తిరుగుతున్నాడు. అయితే, వీఆర్వో చేయడం లేదంటూ ఏకంగా ఆఫీసులోనే మకాం వేశాడు.

కడప జిల్లా కొండాపురం మండలం దత్తాపురం ఆదినారాయణ అనే రైతు తన తల్లిపేరుతో ఉన్న మూడున్నర ఎకరాల భూమిని తనపేరుతో మార్చాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. దీంతో అతడు ఎమ్మార్వో ఆఫీసు ఎదుట పెట్రోల్ మీద పోసుకుని నిప్పంటించుకున్నాడు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 6, 2019, 3:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading