Home /News /crime /

FOUR MAN BOOKED FOR KILLING STUDENT LEADER WHO IS BLACKMAILING LOVERS IN ANANTAPURAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Love Affair:లవర్స్ మధ్య ఎంటరైన మూడో వ్యక్తి.. అన్ని రకాలుగా బ్లాక్ మెయిల్ చేశాడు.. చివరికి ఏమైందంటే..!

ఫ్రతీకాత్మకచిత్రం

ఫ్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం జిల్లా (Anantapuram District) వజ్రకరూరుకు చెందిన మండ్ల తిరుపాల్ యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకు. అదే గ్రామానికి చెందిన బెస్త గురుమూర్తి అనే యువకుడు ఓ యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం తిరుపాల్ కు తెలిసింది.

ఇంకా చదవండి ...
  ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. వాళ్లిద్దరి మధ్య మూడో వ్యక్తి ఎంటరయ్యాడు. వాళ్లిద్దరి రిలేషన్ నచ్చకపోతే వదిలేయ్యాలి. నచ్చితే సపోర్ట్ చేయాలి. కానీ అతడు మాత్రం వేరేలా అలోచించాడు. వాళ్ల ప్రేమవ్యవహారాన్ని ‘క్యాష్’ చేసుకోవాలని చూశాడు. అక్కడితో ఆగలేదు. అమ్మాయిపై కన్నేసి కోరిక తీర్చమని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. కట్ చేస్తే ఆ ప్రేమికులు తీసుకున్న నిర్ణయం వారి జీవితంతో పాటు ఆ మూడో వ్యక్తి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం జిల్లా (Anantapuram District) వజ్రకరూరుకు చెందిన మండ్ల తిరుపాల్ యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకు. అదే గ్రామానికి చెందిన బెస్త గురుమూర్తి అనే యువకుడు ఓ యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం తిరుపాల్ కు తెలిసింది.

  ఐతే విషయం తెలిసిన తిరుపాల్ సైలెంట్ గా ఉండకుండా ప్రేమజంటను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్తానని బెదిరించి వారి వద్ద డబ్బులు డిమాండ్ చేశాడు. అక్కడితో ఆగకుండా యువతిని తన కోరిక తీర్చాలని వేధిస్తుండేవాడు. నిత్యం డబ్బులు డిమాండ్ చేయడం, కోరిక తీర్చాలని యువతిని బలవంతం చేస్తుండటంతో గురుమూర్తి సహించలేకపోయాడు. ఎలాగైనా తిరుపాల్ ను అడ్డుతొలగించుకోవాలని స్కెచ్ వేశాడు.

  ఇది చదవండి: ఇంజనీరింగ్ చదివి ఇదేం పోయేకాలం..? పైత్యం పీక్స్ చేరి పోలీసులకు చిక్కాడు..!


  ఈ క్రమంలో తమ గ్రామానికే చెందిన ఆవుల ఎర్రిస్వామిని సంప్రదించాడు. తిరుపాల్ ను చంపాలని అతడితో చెప్పాడు.అందుకు రూ.3.50 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెంటనే రంగంలోకి దిగిన ఎర్రిస్వామి తన ఫ్రెండ్స్ అయిన మఠం వేణుగోపాల్, చాకలి సునీల్ తో కలిసి అక్టోబర్ 24న పార్టీ చేసుకుందామని చెప్పి తిరుపాల్ ను చింతలపల్లి రోడ్డు సమీపంలోని మిట్టవద్దకు తీసుకెళ్లారు. అప్పటికే వారితో తెచ్చుకున్న కత్తులతో గొంతుకోసి హత్య చేశారు.

  ఇది చదవండి: రూమ్ కి వస్తేనే ప్రభుత్వ ఉద్యోగం.. కలెక్టరేట్ లో యువతికి వేధింపులు.. ఎక్కడంటే..!


  డెడ్ బాడీ దొరక్కుండా చెతులు కట్టేసి తల నుంచి నడుము వరకు సంచిలో కుక్కి.. మిగితా శరీరానికి చీర చుట్టారు. ఆ చీరకు బండరాయి కట్టి ఓ వ్యవసాయబావిలో పడేశారు. అతడి బైక్ తో పాటు హత్యకు ఉపయోగించిన కత్తులను కూడా బావిలోనే వేశారు.

  ఇది చదవండి: తన కన్నా చిన్నవాడితో మహిళ ఎఫైర్.. ఇద్దరకీ ఎక్కడ చెడాలో అక్కడ చెడింది.. చివరికి అనుకోని ట్విస్ట్..!  తిరుపాల్ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదైంది. ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. తిరుపాల్ ఫోన్ కాల్ డేటాతో పాటు చివరిసారిగా అతడు ఎవరితో మాట్లాడింది.. ఎవరిని కలిశాడనే అంశాలపై ఆరాతీశారు. విచారణలో భాగంగా నిందితుల వివరాలను తెలుసుకున్నారు.

  ఇది చదవండి: 17 ఏళ్ల కూతురు అనుమానాస్పద మృతి.. సీక్రెట్ గా దహనం.. అతడితో తల్లి ఎఫైర్ కారణమా..?  శుక్రవారం గురుమూర్తితో సహా హత్యలో పాల్గొన్న మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకొని విచారించగా తామే హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి బైక్, రెండు కత్తులు, బంగారం, వెండి ఆభరణాలు, రూ.80 వేలు డబ్బు స్వాధీనం చేసుకున్నారు. హత్యలో పాల్గొన్న నిందితులపై గతంలో దోపిడీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Purna Chandra
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, Blackmail, Crime news, Lovers

  తదుపరి వార్తలు