నిజామాబాద్లో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..
మృతులను జక్కం గంగమ్మ,జక్కం బాలమణి,సాయిలు, కల్లేపురం సాయిలుగా గుర్తించారు. కారు అతివేగంతో ఆటోను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
news18-telugu
Updated: November 17, 2019, 8:58 PM IST

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: November 17, 2019, 8:58 PM IST
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఠాణాకలాన్ శివారులో ఎదురెదురుగా వెళ్తున్న కారు-ఆటో ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను జక్కం గంగమ్మ,జక్కం బాలమణి,సాయిలు, కల్లేపురం సాయిలుగా గుర్తించారు. కారు అతివేగంతో ఆటోను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందగానే స్థానిక ఎస్ఐ అక్కడికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Loading...