హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఇంటి డోర్ వద్ద కవర్‌లో చాక్లెట్స్.. పిల్లలకు ఇచ్చిన నానమ్మ.. తిన్న కాసేపటికే ఘోరం.. నలుగురు చిన్నారులు మృతి

ఇంటి డోర్ వద్ద కవర్‌లో చాక్లెట్స్.. పిల్లలకు ఇచ్చిన నానమ్మ.. తిన్న కాసేపటికే ఘోరం.. నలుగురు చిన్నారులు మృతి

మృతుల ఇంటి డోర్ వద్ద లభించిన ఈ టోఫీలు విషపూరితమైనవని పోలీసులు భావిస్తున్నారు. టోఫీల రేపర్లపై వాలిన ఈగలు కూడా చనిపోయాయని చెప్పారు. ఒక టోఫీని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.

మృతుల ఇంటి డోర్ వద్ద లభించిన ఈ టోఫీలు విషపూరితమైనవని పోలీసులు భావిస్తున్నారు. టోఫీల రేపర్లపై వాలిన ఈగలు కూడా చనిపోయాయని చెప్పారు. ఒక టోఫీని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.

మృతుల ఇంటి డోర్ వద్ద లభించిన ఈ టోఫీలు విషపూరితమైనవని పోలీసులు భావిస్తున్నారు. టోఫీల రేపర్లపై వాలిన ఈగలు కూడా చనిపోయాయని చెప్పారు. ఒక టోఫీని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.

  ఓ వృద్ధురాల ఉదయం ఇంటి ముందు ఊడుస్తుండగా డోర్ వద్ద కవర్ లభ్యమైంది. దాన్ని తెరిచి చేస్తూ టోఫీలు కనిపించాయి. ఆ చాక్లెటని తన ముగ్గురు మనవలతో పాటు పక్కింట్లో ఉండే మరో పిల్లవాడికి ఇచ్చింది. అంతే.. అవి తిన్న కాసేపటికే ఘోరం జరిగింది. నలుగురు చిన్నారులు స్పృహతప్పి పడిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్తే మరణించారని చెప్పారు. ఊహించని ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్  (Yogi Adityanath) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసలేం జరిగిందో తెలుసుకోవాలని దర్యాప్తునకు ఆదేశించారు.

  Bride Shocking Decision: మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలో ఊహించని ట్విస్ట్.. ఇలా శుభంకార్డు

  పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కసాయ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిలీప్‌నగర్‌కు చెందిన లాథూర్ తోలాలో ముఖియా దేవి ఫ్యామిలీ నివసిస్తోంది. బుధవారం ఉదయం ఆమె తన ఇంటి ముంచు చీపురుతో ఊడుస్తున్న సమయంలో.. డోర్ వద్ద ఒక పాలిథీన్ కవర్ కనిపించింది. అందులో టోఫీలు ఉన్నాయి. టాఫీలను పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకే వాటిలో మూడింటిని తన ముగ్గురు మనవళ్లకు ఇచ్చింది. మర టాఫీని పక్కింట్లో ఉండే బాలుడికి ఇచ్చింది. నలుగురు చిన్నారులు టోఫీలను తిన్నారు. ఐతే ఆ టోఫీలను తిన్న కాసేపటికే ఆ నలుగురు చిన్నారులు స్పృహతప్పి నేలపై పడిపోయారు. ఎంత పిలిచాన పలకలేదు. స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కానీ ఎంత సేపటికీ అంబులెన్స్ రాకపోవడంతో వారిని బైక్స్‌పై ఎక్కించుకొని.. జిల్లా ఆస్పత్రికి తరలించారు. చిన్నారులను పరీక్షించిన డాక్టర్లు.. వారు మరణించినట్లు ప్రకటించారు. మృతుల్లో ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. వారి వయసు రెండు నుంచి ఐదేళ్ల లోపే ఉంటుంది. అప్పటిదాకా ఆడుకుంటూ ఉన్న పిల్లలు.. టోఫీలు తిన్న వెంటనే మరణించారని తెలిసి గ్రామస్తులుషాక్ అయ్యారు.

  Medak: వృద్ధురాలి దగ్గరున్న వాటిని చూసే స్కెచ్‌ వేశాడు..ప్లాన్‌ బెడిసి కొట్టింది

  మృతుల ఇంటి డోర్ వద్ద లభించిన ఈ టోఫీలు విషపూరితమైనవని పోలీసులు భావిస్తున్నారు. టోఫీల రేపర్లపై వాలిన ఈగలు కూడా చనిపోయాయని చెప్పారు. ఒక టోఫీని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వివరాలను సేకరించారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని.. చిన్నారుల మృతికి కారణమేంటన్నది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. ల్యాబ్ రిపోర్టులు వచ్చిన తర్వాత స్పష్టత వస్తుందని చెప్పారు. ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నలుగురు చిన్నారులు చనిపోవడం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబానికి తక్షణసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం ఘటనపై విచారణ జరిపించాలని స్పష్టం చేశారు. ఎవరో కావాలనే చాక్లెట్స్‌లో విష కలిపారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. మొత్తంగా ఈ ఘటనతో స్థానికులు ఉలికిపడ్డారు. అభం శుభం తెలియని నలుగురు చిన్నారులు మరణించడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

  First published:

  Tags: Crime, Crime news, Up news, Uttar pradesh

  ఉత్తమ కథలు