హోమ్ /వార్తలు /క్రైమ్ /

Human Smuggling Ops : యూఎస్-కెనడా బోర్డర్ లో నలుగురు భారతీయుల మృతదేహాలు గుర్తింపు

Human Smuggling Ops : యూఎస్-కెనడా బోర్డర్ లో నలుగురు భారతీయుల మృతదేహాలు గుర్తింపు

అమెరికా-కెనడా సరిహద్దు(ఫైల్ ఫొటో)

అమెరికా-కెనడా సరిహద్దు(ఫైల్ ఫొటో)

Human Smuggling : డబ్బులు తీసుకొని అక్రమంగా దేశ సరిహద్దు దాటించి మరో దేశంలోకి తీసుకెళ్లే గ్యాంగ్ లు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వారిని నమ్మి చాలా మంది జైలు పాలవ్వడం లేదా ప్రాణాలు కోల్పోతున్న ఘటనల గరించి మనం తరచూ వింటూనే ఉన్నాం. అయితే తాజాగా ఇలాంటి ఘటనే అమెరికా-కెనడా సరిహద్దుల్లో జరిగింది. మంచు తుఫాను సమయంలో బోర్డర్ క్రాసింగ్ ప్రయత్నం విఫలమై తీవ్రమైన చలికి గురికావడం వల్ల నలుగురు భారతీయులు మృతి చెందారు.

ఇంకా చదవండి ...

cnFour Indians Died  :  మనుషుల అక్రమ రవాణ కొనసాగుతూనే ఉంది. డబ్బులు తీసుకొని అక్రమంగా దేశ సరిహద్దు దాటించి మరో దేశంలోకి తీసుకెళ్లే  గ్యాంగ్ లు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వారిని నమ్మి చాలా మంది జైలు పాలవ్వడం లేదా ప్రాణాలు కోల్పోతున్న ఘటనల గరించి మనం తరచూ వింటూనే ఉన్నాం. అయితే తాజాగా ఇలాంటి ఘటనే అమెరికా-కెనడా సరిహద్దుల్లో జరిగింది. అమెరికా-కెనడా సరిహద్దుల్లో కెనడా భూభాగంవైపు బుధవారం ఒక పసిపాపతో నాలుగు మృతదేహాలను గుర్తించారు. మృతులందరూ భారతీయులేనని అధికారులు గుర్తించారు. ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి.. వీరందిరినీ అక్రమంగా అమెరికాలోకి తీసుకెళ్తానని నమ్మబలికి వారి వద్ద నుంచి డబ్బులు తీసుుకొని చివరికి మధ్యలోనే వారిని వదిలేసి వెళ్లిపోయాడని,మంచు తుఫాను సమయంలో బోర్డర్ క్రాసింగ్ ప్రయత్నం విఫలమై తీవ్రమైన చలికి గురికావడం వల్ల నలుగురు భారతీయులు మృతి చెందారని స్థానిక అధికారులు గుర్తించారు.

కెనడాలోని మానిటోబా ప్రావిన్స్‌లోని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP)తెలిపిన వివరాల ప్రకారం....బుధవారం ఉదయం కెనడాలోని మనిటోబా ఫ్రావిన్స్ నుంచి కొందరు వ్యక్తుల అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశించారు. వారిని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(USBP)అధికారులు పట్టుకున్నారు.  రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP)లకు అమెరికా ఈ సమాచారాన్ని అందించింది. అయితే తమకు పట్టుబడినవారిలో ఒకరి వద్ద పసిబిడ్డ కోసం ఉద్దేశించిన వస్తువులు ఉన్నాయని, అయితే ఏ శిశువు కూడా పట్టుబడినవారి వద్ద లేరని అమెరికా అధికారుల నుంచి సమాచారం అందడంతో కెనడియన్ మౌంటెడ్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

ALSO READ Trending Love Story : ప్రేయసి కోసం కిడ్నీ దానం..నెల రోజుల తర్వాత మరొకరితో ప్రియురాలు జంప్

నాలుగు గంటల తర్వాత, స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కెనడా సరిహద్దులో ఎమర్సన్ పట్టణానికి(అమెరికా టౌన్)కి దగ్గరగా ముగ్గురు వ్యక్తుల మృతదేహాలను అధికారులు కనుగొన్నారు.  సెర్చ్ ఆపరేషన్ ని కొనసాగించగా కొద్ది సేపటి తర్వాత మరో వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. వీరందరినీ అక్రమంగా అమెరికాలోకి తీసుకెళ్తానని ఓ వ్యక్తి వీరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడని,అయితే అమెరికా అధికారులు సరిహద్దు దాటిన కొందరిని పట్టుకున్నారు అనే సమాచారం రావడంతో వీరిని మధ్యలోనే వదిలి వెళ్లిపోయాడని అధికారులు గుర్తించారు.

అమెరికాలోని మిన్నెసోటా జిల్లా అటార్నీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం...బుధవారం రోజే కెనడా సరిహద్దుకు దక్షిణంగా దాదాపు పావు మైలు దూరంలో చట్టవిరుద్దంగా యూఎస్ లోకి ప్రవేశించిన ఐదుగురు భారతీయ పౌరులను అమెరికా పోలీసులు పట్టుకున్నారు. ఎవరైనా వచ్చి తమను తీసుకెళ్తారని ఆశించి సరిహద్దు గుండా నడిచామని,11 గంటలకు పైగా నడుస్తూనే ఉన్నామని పట్టుబడిన వారు పోలీసులకు వివరించారు. పట్టుబడినవారిలో ఒకరి దగ్గర ఉన్న బ్యాక్‌ప్యాక్‌లో పిల్లల బట్టలు, డైపర్, బొమ్మలు మరియు కొన్ని పిల్లలకు మందులు ఉన్నాయి.

అతడిని విచారించగా మరో నలుగురు భారతీయులు ముందు రోజు వరకు తమతో పాటే కలిసి నడిచారని,అయితే రాత్రి సమయంలో విడిపోయారని అధికారులకు తెలిపారు. ఈ వస్తువులు వారివేనని తెలిపారు. కెనడా సరిహద్దుల్లో అధికారులు గుర్తించిన మృతదేహాలు విడిపోయిన నలుగురివిగా ప్రాథమికంగా గుర్తించారు. బాధిత వ్యక్తులు మంచు తుఫాను మధ్యలో ఒంటరిగా మిగిలిపోయారని,తీవ్రమైన చలి కారణంగా వీరు చనిపోయి ఉంటారని అధికారులు తెలిపారు. చనిపోయిన నలుగురిలో పసిపాప, ఒక యువకుడు, ఒక పెద్ద మగ వ్యక్తి, ఒక పెద్ద ఆడ మనిషి ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే వీరి గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఇక, పత్రాలు లేని విదేశీ పౌరులను అక్రమంగా దేశంలోకి ప్రేవేశించేలా చేస్తున్నాడన్న ఆరోపణలతో, ఫ్లోరిడాకు చెందిన 47ఏళ్ల స్టీవ్ షాండ్ అనే వ్యక్తిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.

First published:

Tags: Canada, USA

ఉత్తమ కథలు