ఘోర రోడ్డు ప్రమాదం.. మృత్యువులోనూ వీడని స్నేహబంధం..

నలుగురు స్నేహితులు కలిసి వ్యక్తిగత పని మీద బుధవారం రాత్రి కారులో నరసరావుపేట నుంచి విజయవాడకు బయలుదేరారు.

news18-telugu
Updated: July 3, 2020, 12:14 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. మృత్యువులోనూ వీడని స్నేహబంధం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వారంతా స్నేహితులు. ఏ పని చేసినా నలుగురు కలిసే చేస్తారు. ఎందులోనైనా అందరిది ఒక్కటే మాట అన్నట్టుగా కలిసి ఉంటారు. వారి స్నేహాన్ని చూసి విధికి కన్ను కుట్టిందేమో అన్నట్టుగా రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన మేడసాని వెంకట శ్రీచందు, వింజమూరి హరికృష్ణ, షేక్ ఫిరోజ్ అహ్మద్, రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామానికి చెందిన అత్తలూరి బలరాం వీరంతా స్నేహితులు. అయితే ఈ నలుగురు స్నేహితులు కలిసి వ్యక్తిగత పని మీద బుధవారం రాత్రి కారులో నరసరావుపేట నుంచి విజయవాడకు బయలుదేరారు. మార్గమధ్యలో గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్దకు రాగానే గుంటూరు వైపు నుంచి వస్తున్న కంటైనర్ లారీ అదుపు తప్పి డివైడర్ మీదుగా అవతలి వైపు వెళ్లి ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది.

దీంతో కారు నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయణిస్తున్న బలరాం(27), హరికృష్ణ(26) అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకట శ్రీచందు(27), ఫిరోజ్ అహ్మద్(26) మరణించారు. కంటైనర్ లారీ డ్రైవర్ పరారు కాగా పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.
First published: July 3, 2020, 12:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading