ఏపీలోని మరో జిల్లాలో శానిటైజర్ తాగి నలుగురు దుర్మరణం...

చిత్తూరు జిల్లా తిరుపతిలో శానిటైజర్ తాగి నలుగురు మృతిచెందారు.

news18-telugu
Updated: August 7, 2020, 8:47 PM IST
ఏపీలోని మరో జిల్లాలో శానిటైజర్ తాగి నలుగురు దుర్మరణం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో శానిటైజర్ తాగి చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. చిత్తూరు జిల్లా తిరుపతిలో శానిటైజర్ తాగి నలుగురు మృతిచెందారు. మృతులు లీలామహల్ సర్కిల్ వద్ద ఉండే పారిశుద్ధ్య కార్మికులుగా గుర్తించారు. మృతదేహాలు తిరుపతి రుయా మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించనున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. ప్రకాశం జిల్లాలోని కురిచేడు, పామూరులో శానిటైజర్ తాగి 16 మంది ప్రాణాలు విడిచారు. మద్యం దొరక్క శానిటైజర్‌ తాగి వారు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. అలాగే, కడప జిల్లా పెండ్లిమర్రిలో శానిటైజర్ తాగిన ఘటనలో ముగ్గురు చనిపోయారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 7, 2020, 8:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading