నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ముక్తల్ మండలం గుడిగండ్ల సమీపంలో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఓ ఐదేళ్ల చిన్నారితో పాటు ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్నకారు అదుపు తప్పి బోల్తా కొట్టినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్ర గాయాలు అయిన వ్యక్తిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇక, ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ చిన్నారి షాక్లో ఉండిపోయింది.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. అలాగే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై విచారణ చేపట్టారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.