హోమ్ /వార్తలు /crime /

తల్లి ఫోన్ చేస్తున్నా స్పందించని కూతురు.. వెళ్లి చూసే సరికి ఘోరం.. ఆ ఇంట్లో నాలుగు శవాలు

తల్లి ఫోన్ చేస్తున్నా స్పందించని కూతురు.. వెళ్లి చూసే సరికి ఘోరం.. ఆ ఇంట్లో నాలుగు శవాలు

సోనాల్ భర్త వినోద్ మాత్రం కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్. వినోద్ ఎక్కడున్నాడో తెలియదు. మూడు నాలుగు రోజులుగా అతడు కనిపించడం లేదని చుట్టుపక్కల వారు చెప్పారు.

సోనాల్ భర్త వినోద్ మాత్రం కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్. వినోద్ ఎక్కడున్నాడో తెలియదు. మూడు నాలుగు రోజులుగా అతడు కనిపించడం లేదని చుట్టుపక్కల వారు చెప్పారు.

సోనాల్ భర్త వినోద్ మాత్రం కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్. వినోద్ ఎక్కడున్నాడో తెలియదు. మూడు నాలుగు రోజులుగా అతడు కనిపించడం లేదని చుట్టుపక్కల వారు చెప్పారు.

    వరుసగా ఫోన్ చేస్తున్నా కూతురు స్పందించలేదు. రోజులు గడుస్తున్నాయి. కానీ అక్కడి నుంచి స్పందన లేదు. తన ఫోనే కాదు.. ఏ ఫోన్ నుంచి కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఏదో జరిగిందని ఆమెకు అనుమానం కలిగింది. వెంటనే పోలీస్‌ కంట్రోల్ రూమ్‌కి కాల్ చేసి చెప్పింది. ఆ తర్వాత పోలీసులు ఇంటికి వెళ్లి చూసేసరికి..అక్కడ షాకింగ్ సీన్ కనిపించింది. ఇంట్లో నాలుగు శవాలు కనిపించాయి. ఓ మహిళ, ఇద్దరు చిన్నపిల్లలు, ఓ వృద్ధురాలి మృతదేహాలు లభ్యమయ్యాయి. గుజరాత్‌లో ఈ ఘటన జరిగింది. మరి వారు ఎలా చనిపోయారు? ప్రమాదవశాత్తు జరిగిందా? లేదంటే ఎవరైనా చంపేశారా?

    Shocking: మురుగు కాల్వను శుభ్రం చేస్తుండగా ఊహించని విషాదం.. ఇద్దరు మృతి..

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అహ్మదాబాద్‌ బిరాట్ నగర్ ప్రాంతంలో ఉన్న దివ్యప్రభ సొసైటీలో సోనాల్ కుటుంబం నివసిస్తోంది. అక్కడ సోనాల్‌తో పాటు ఆమె భర్త వినోద్, కుమారుడు గణేష్, కుమార్తె ప్రగతి, ఆమె అమ్మమ్మ సుభద్ర ఉంటారు. ఐతే సోనాల్  తల్లి అంబాబెన్ కొన్ని రోజులుగా ఆమెకు ఫోన్ చేస్తోంది. కానీ సోనాల్ లిఫ్ట్ చేయడం లేదు. నాలుగు రోజులైనా స్పందనలేదు. అల్లుడి ఫోన్ స్విచాఫ్ వస్తోంది.  ఏదో జరిగిందని అంబాబెన్ అనుమానించి.. మంగళవారం సాయంత్రం పోలీస్ కంట్రోల్‌రూమ్‌కి కాల్ చేసింది. తన కూతురు 4 రోజుల నుంచి ఫోన్ తీయడం లేదని.. తనకు భయంగా ఉందని చెప్పింది. ఆమె ఫోన్ చేసిన కాసేపటికే పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ ఫ్లాట్ తలుపులు మూసిఉన్నాయి. కాలింగ్ బెల్ మోగించినా ఎవరూ తీయలేదు. ఎంత పిలిచినా స్పందనలేదు. చివరకు పోలీసులు డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే భరించలేని దుర్వాసన వచ్చింది. నాలుగు వేర్వేరు గదుల్లో నాలుగు మృతదేహాలు లభించాయి. మృతులను సోనాల్,సుభద్ర, గణేష్, ప్రగతిగా గుర్తించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. చుట్టుపక్కల వారిని విచారించారు.

    Shocking: చిరుతతో పోరాడిన మహిళ... సివంగిలా మారింది.. తోక పట్టుకుని లాగి పులిపై పిడిగుద్దుల

    ఐతే ఇంటి పెద్ద, సోనాల్ భర్త వినోద్ మాత్రం కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్. వినోద్ ఎక్కడున్నాడో తెలియదు. మూడు నాలుగు రోజులుగా అతడు కనిపించడం లేదని చుట్టుపక్కల వారు చెప్పారు. వినోద్ పరారీలో ఉండడంతో అతడే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నాలుగు రోజుల క్రితమే హత్యలు జరిగాయని.. అందువల్లే మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తోందని పోలీసులు వెల్లడించారు. ఐతే వినోదే భార్యాపిల్లలను చంపాడా? లేదంటే ఇంకేవరైనా చేశారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ వినోదే వారిని చంపితే.. ఎందుకు చంపాల్సి వచ్చింది? సొంత కుటుంబ సభ్యులనే దారుణంగా హత్య చేయడానికి కారణాలు ఏంటన్న వివరాలు తెలియాల్సి ఉంది.

    First published:

    ఉత్తమ కథలు