హోమ్ /వార్తలు /క్రైమ్ /

గడ్డి వాము తగులబడటం చూసి మంటలు ఆర్పేశారు.. ఆ తర్వాత చూస్తే బూడిదలో నాలుగు మృతదేహాలు

గడ్డి వాము తగులబడటం చూసి మంటలు ఆర్పేశారు.. ఆ తర్వాత చూస్తే బూడిదలో నాలుగు మృతదేహాలు

Tragedy : అమ్మమ్మ, రెండు కుక్క పిల్లలను కలిపి సజీవ దహనం..చేసిన మనవడు..

Tragedy : అమ్మమ్మ, రెండు కుక్క పిల్లలను కలిపి సజీవ దహనం..చేసిన మనవడు..

Fire Accident: మంట‌లు చ‌ల్లారిన త‌ర్వాత ఆ బూడిద‌లో న‌లుగురి మృత‌దేహాలు ప‌డిఉన్నాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిని స్థానికులు చెప్పారు. మృతదేహాలు బాగా కాలిపోయిన స్థితిలో ఉన్నాయి.

  గడ్డివాము కాలిపోయి నలుగురు వ్యక్తులు మరణించారు. మంటల్లో కాలిపోవడంతో వారి మృతదేహాలు కూడా గుర్తుపట్టరాని విధంగా మారిపోయాయి. తమిళనాడులోని దిండిగల్ జిల్లా వట్టకొండన్‌వలసు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం... శనివారం తెల్లవారుజామున ఓ గడ్డి వాము తగులబడింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో చుట్టు పక్కల ప్రజలు అప్రమత్తమయ్యారు. తాము బిందెలతో నీటిని ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మంటలు భారీగా ఎగసిపడుతున్నాయ. ఈ క్రమంలో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి మంటలను ఆర్పివేశారు. హమ్మయ్య అని అందరూ ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో.. అక్కడ ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

  మంట‌లు చ‌ల్లారిన త‌ర్వాత ఆ బూడిద‌లో న‌లుగురి మృత‌దేహాలు ప‌డిఉన్నాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిని స్థానికులు చెప్పారు. మృతదేహాలు బాగా కాలిపోయిన స్థితిలో ఉన్నాయి. ఐతే గడ్డి వాము తగులబడి ఏకంగా నలుగురు మరణించడంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. ఐతే ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని.. వాటిని ఆర్పే క్రమంలో వీరు మరణించారా? లేదంటే ఎవరైనా హత్యచేసి గడ్డివాములో పడేసి.. దహనం చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఐతే ఒకే ఫ్యామిలీలో నలుగురు మరణించడం.. అది కూడా మంటల్లో కాలిపోవడంతో... స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సమీప బంధువులంతా శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని.. వారి మృతికి గల కారణాలను తెలుసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

  ఇవి కూడా చదవండి:

  అమ్మాయిలతో నగ్నంగా నిలబెట్టించే గ్యాంగ్. బాలీవుడ్ సెలబ్రిటీలే టార్గెట్!

  Sex Racket: టాప్ మోడల్, టీవీ నటి అరెస్టు.. గంటకు లక్ష వసూలు!

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Crime news, Fire Accident, Tamilnadu

  ఉత్తమ కథలు