మెదక్ జిల్లాలో అమానుషం... 4 రోజుల ఆడపిల్ల.. రూ.5వేలకు అమ్మకం

మెదక్ జిల్లాలో రూ.5000కు ఆడపిల్ల అమ్మకం

మెదక్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల పసికందును తల్లిదండ్రులు రూ.5వేలకు విక్రయించారు.

  • Share this:
    మెదక్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల పసికందును తల్లిదండ్రులు రూ.5వేలకు విక్రయించారు. అమ్మకం జరిగిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ తాండలో ఈ ఘటన జరిగింది. పసిబిడ్డ తల్లిదండ్రులకు ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయని, అందుకే పసికందును అమ్ముకునేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. అయితే, పసిబిడ్డ తల్లిదండ్రులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడో సంతానంగా కూడా ఆడపిల్లే పుట్టింది. దీంతో పసిబిడ్డ తండ్రి తరఫు కుటుంబసభ్యులు అసంతృప్తితో ఉన్నారు. తమ కొడుక్కి పుట్టిన మూడో ఆడపిల్లను అమ్మేసి, అతడికి రెండోపెళ్లి చేయాలని కూడా చూస్తున్నట్టు సమాచారం. పసిబిడ్డను కొనుక్కోవడానికి ముందుకు వచ్చిన వారికి పిల్లలు లేదు. దీంతో ఆడపిల్లను కొనుక్కుని పెంచుకోవడానికి సిద్ధపడినట్టు తెలిసింది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published: