ఫోన్ కాల్‌తో.. రూ. 4.2 కోట్లు విలువ చేసే గంజాయి స్వాధీనం

ప్రతీకాత్మక చిత్రం

డ్రగ్స్ లింకులకు సంబంధించిన పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కమ్రంలోనే వారికి వచ్చిన ఫోన్ కాల్‌తో.. గంజాయి పండిస్తున్న ‌నాలుగు ఎకరాల భూమిని పోలీసులు సీజ్ చేశారు

 • Share this:
  ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ లింకులకు సంబంధించిన పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కమ్రంలోనే వారికి వచ్చిన ఫోన్ కాల్‌తో.. గంజాయి సాగు చేస్తున్న ‌నాలుగు ఎకరాల భూమిని పోలీసులు గుర్తించారు. రూ. 4.2 కోట్లు విలువచేసే దాదాపు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గరుని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే గంజాయి సాగుకు సంబంధించిన ప్రధాన నిందితుడి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.

  వివరాలు.. నటి రాగిణి ద్వివేది అరెస్ట్ తర్వాత రాంపూర పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మొలకల్మురు తాలూకాలో ఉన్న వదేరహళ్లిలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్టుగా సమాచారం అందింది. దీంతో విచారణకు వెళ్లిన పోలీసులకు స్థానికులు గంజాయి సాగు జరుగుతున్న ప్రదేశానికి తీసుకువెళ్లారు. అక్కడ గంజాయి సాగు చూసి షాకయిన పోలీసులు.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో చిత్రదుర్గ ఎస్పీ రాధిక ఘటన స్థలాన్ని సందర్శించారు. ఆధారాల కోసం ఆ భూమిలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను అక్కడి నుంచి తరలించారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి ముగ్గరును అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు.

  ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న రుద్రేశ్ కోసం గాలింపు చేపట్టారు. త్వరలోనే అతని పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. అతని విచారిస్తే.. డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందన్నారు. జిల్లాల దాటి ఈ దందా సాగుతున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
  Published by:Sumanth Kanukula
  First published: