మైనర్‌ను గర్భవతిని చేసిన ఇద్దరు..  నిందితుల్లో పెంపుడు తండ్రి కూడా

తమిళనాడులో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అందులో ఆ యువతి పెంపుడు తండ్రి కూడా ఉన్నాడు.

news18-telugu
Updated: September 22, 2020, 7:30 AM IST
మైనర్‌ను గర్భవతిని చేసిన ఇద్దరు..  నిందితుల్లో పెంపుడు తండ్రి కూడా
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
తమిళనాడులో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అందులో ఆ యువతి పెంపుడు తండ్రి కూడా ఉన్నాడు. అయితే ఇటీవల కడుపు నొప్పితో యువతి ఆస్పత్రిలో చేరడంతో.. వైద్యులు ఆమె గర్భవతి అని చెప్పడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇక, బాధిత యువతికి రెండేళ్ల వయసు ఉన్నప్పుడు నిందితుడు దత్తత తీసుకున్నాడు. ఇటీవల ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో పెంపుడు తండ్రి
నమ్గాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ మైనర్ ప్రెగ్నెంట్‌గా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఆమెకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం సిఫారసు చేశారు. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్ లైన్ అధికారులు, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాలు.. బాధిత యువతికి వారి ఇంటికి సమీపంలోని 29 ఏళ్ల వ్యక్తితో శారీరక సంబంధం ఉంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని నమ్మించిన అతడు..ఆమెకు లైగికంగా దగ్గరయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి పెంపుడు తండ్రి.. ఆమెపై వేధింపులకు దిగాడు. ఆమెను రేస్ కూడా చేశాడు. నిందితులు ఇద్దరు కూడా ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని యువతిని హెచ్చరించారు. అయితే బాలిక గర్భం దాల్చడంతో వీరి వేధింపులు వెలుగుచూశాయి. దీంతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Published by: Sumanth Kanukula
First published: September 22, 2020, 7:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading