సెక్స్ ఫోటోలు,వీడియోల కోసం.. 6వేల ఖాతాలు హ్యాక్ చేసిన యాహూ మాజీ ఉద్యోగి..

పదేళ్లు యాహూ సంస్థలో నమ్మకంగా పనిచేసిన రూయిజ్.. ఇలాంటి నేరానికి పాల్పడటం ఆ సంస్థను ఆశ్చర్యానికి గురిచేసింది. రూయిజ్ ఉదంతంపై వెలుగులోకి రావడంతో అతనిపై కేసు నమోదైంది.

news18-telugu
Updated: October 2, 2019, 1:19 PM IST
సెక్స్ ఫోటోలు,వీడియోల కోసం.. 6వేల ఖాతాలు హ్యాక్ చేసిన యాహూ మాజీ ఉద్యోగి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
యాహూ సంస్థలో ఇంజనీర్‌గా పనిచేసిన రూయిజ్ అనే ఓ మాజీ ఉద్యోగి.. అక్కడ పనిచేస్తున్న సమయంలో తనకున్న అధికారాలను దుర్వినియోగం చేశాడు. యాహూ ఇంటర్నల్ నెట్‌వర్క్‌తో తనకున్న యాక్సెస్‌ని ఉపయోగించి ఏకంగా 6వేల ఖాతాలను హ్యాక్ చేశాడు. కేవలం సెక్సువల్ కంటెంట్ కోసమే రూయిజ్ ఇంత భారీ స్థాయిలో హ్యాకింగ్‌కి పాల్పడటం గమనార్హం. ఆయా ఖాతాల్లో ఖాతాదారులు భద్రపరుచుకున్న రహస్య ఫోటోలు,వీడియోలను అతను డౌన్‌లోడ్ చేసి.. తన హార్డ్ డ్రైవ్‌లోకి పంపించుకున్నాడు. మహిళల నగ్న చిత్రాలు,వారి సెక్స్ వీడియోల కోసమే అతనిలా చేశాడు.రూయిజ్ హ్యాక్ చేసిన ఖాతాల్లో.. తన సహోద్యోగులైన మహిళల ఖాతాలు కూడా ఉన్నాయి.

యాహూ యాక్సెస్‌ని ఉపయోగించి ఫేస్‌బుక్,ఆపిల్ క్లౌడ్,జీమెయిల్,డ్రాప్ బాక్స్ వంటి ఖాతాలను హ్యాక్ చేసి ఫోటోలు,వీడియోలు సంపాదించాడు.పదేళ్లు యాహూ సంస్థలో నమ్మకంగా పనిచేసిన రూయిజ్..ఇలాంటి నేరానికి పాల్పడటం ఆ సంస్థను ఆశ్చర్యానికి గురిచేసింది. రూయిజ్ ఉదంతంపై వెలుగులోకి రావడంతో అతనిపై కేసు నమోదైంది. ఫిబ్రవరి 3న ఈ కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వెల్లడించనుంది. రూయిజ్‌కు ఐదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు.

First published: October 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>