ఆరో పెళ్లికి సిద్దమైన మాజీ మంత్రి.. ఊహించని షాక్ ఇచ్చిన మూడో భార్య..

ప్రతీకాత్మక చిత్రం

ఓ మాజీ మంత్రి ఆరోసారి పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయాడు. అంత సవ్యంగా జరుగుతుందనుకునే సమయంలో అతనికి ఊహించని షాక్ తగిలింది.

 • Share this:
  ఓ మాజీ మంత్రి ఆరోసారి పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయాడు. అంత సవ్యంగా జరుగుతుందనుకునే సమయంలో అతనికి ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి మూడో భార్య ఫిర్యాదు.. పెళ్లిని అడ్డుకన్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా చోటుచేసుకుంది. వివరాలు.. రాష్ట్ర మాజీ మంత్రి చౌదరి బషీర్.. ఆరోసారి పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యాడు. అయితే ఈ విషయం తెలిసిన బషీర్.. మూడో భార్య నగ్మా అతనిపై మంటోలా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బషీర్ మహిళలను వేధిస్తాడని తెలిపింది. 2012లో తనకు, బషీర్‌కు పెళ్లి జరిగిందని చెప్పింది. పెళ్లి జరిగిన తర్వాత బషీర్.. తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని పేర్కొంది.

  చాలాసార్లు బలవతంగా శారీరక సంబంధం పెట్టకున్నాడని తెలిపింది. మహిళలను వేధించడం అతనికి సరదా అని పేర్కొంది. బషీర్‌ మరో వివాహం చేసుకుంటున్నట్టు తనకు గత నెల 23న సమాచారం అందిందని, దీనిపై నిలదీయడంతో తనను తీవ్రంగా హింసించడంతో పాటు ట్రిపుల్‌ తలాక్‌ రూపంలో విడాకులు ఇచ్చి ఇంట్లోంచి బయటకు పంపించారని తెలిపింది. అంతేకాకుండా బషీర్‌పై సంచలన ఆరోపణలతో కూడిని ఓ వీడియోను కూడా నగ్మా సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. పోలీసులు తనకు సాయం చేయాలని కోరింది.

  నగ్మా ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు ఆ వివాహాన్ని అడ్డుకోవడంతోపాటు ముస్లిం మహిళా వివాహ చట్టం కింద పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. గతంలోనూ అతడిపై ఈ తరహా కేసు నమోదవగా.. 23 రోజుల పాటు జైల్లో గడిపాడు. ఇక, బషీర్ మాయవతి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత అతడు సమాజ్‌వాదీ పార్టీలో చేరాడు. అనంతరం ఆ పార్టీని కూడా వీడినట్టుగా సమాచారం. అయితే ప్రస్తుతం అతడు ఏ పార్టీలో ఉన్నాడనేదానిపై స్పష్టత లేదు.
  Published by:Sumanth Kanukula
  First published: